తెలంగాణ

కలెక్టర్ కారు జప్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 20: ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన అద్దె బకాయిలు, మరమ్మతుల ఖర్చు చెల్లింపులో తీవ్రజాప్యంపై న్యాయస్థానం జిల్లాయంత్రాంగంపై కొరడా ఝళిపించింది. ప్రైవేటు భవనం అద్దె, మరమ్మతు ఖర్చులు చెల్లించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవటాన్ని ఆక్షేపిస్తూ వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ కారును జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలలోకి వెడితే..మహిళా, శిశుసంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ విభాగానికి సంబంధించిన బాలసదనం నిర్వహణకు గతంలో నగరంలోని బాలసముద్రంలో కరీంనగర్ నివాసి వెంకట్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ తరువాత ఈ బాలసదనాన్ని మరో భవనంలోకి మార్చారు. కానీ తొమ్మిది నెలల అద్దె బకాయిలు, భవనం మరమ్మతు ఖర్చులు కలిపి మొత్తం మూడులక్షల రూపాయల కోసం ఆయన పలుమార్లు ఐసీడీఎస్, మహిళా, శిశుసంక్షేమ అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోవటంతో కోర్టులో కేసు వేసారు. అద్దె బకాయి, మరమ్మతు ఖర్చులు బకాయి ఉన్నట్లు అప్పట్లో పనిచేసిన అధికారులు అంగీకరిస్తూ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఇంటి అద్దె, మరమ్మతు ఖర్చుల బకాయిలు వెంటనే చెల్లించాలని వరంగల్ రెండు అదనపు సబ్‌కోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఇంటి యజమాని కోర్టులో మళ్లీ పిటిషన్ వేసారు. రెండవ అదనపు సబ్‌కోర్టు జడ్జి సత్యనారాయణ బకాయిల చెల్లింపులో జాప్యాన్ని తప్పుపడుతూ అర్బన్ జిల్లా కలెక్టర్ కారును జప్తు చేయాలని ఆదేశాలు జారీచేసారు. ఈ మేరకు శనివారం కోర్టు సిబ్బంది సబ్‌కోర్టు జడ్జి అదేశాలను కలెక్టరేట్ కార్యాలయంలో అందచేయటంతో అధికారుల్లో హడావుడి మొదలయింది. కలెక్టర్ ఆమ్రపాలి మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులను, ఐసీడీఎస్ అధికారులను పిలిపించి తెలుసుకున్నారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.