తెలంగాణ

సిగ్నల్, కమ్యూనికేషన్స్‌లో 17 మందికి ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈలో శిక్షణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ఇండియన్ రైల్వే సర్వీస్ సిగ్నల్ ఇంజినీరింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 17 మంది ప్రొబెషనరీ ఇంజినీర్లకు రైల్వే బోర్డు సిగ్నల్, టెలీకమ్యూనికేషన్స్ విభాగం డైరక్టర్ జనరల్ అఖిల్ అగర్వాల్ సర్ట్ఫికెట్లను ప్రదానం చేశారు. శనివారం నాడిక్కడ ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ (ఇరిసెట్)లో శిక్షణ పొందిన 17 మందిలో నలుగురు మహిళా ఇంజినీర్లు కూడా సర్ట్ఫికెట్లను స్వీకరించారు. వీరంతా యుపిఎస్‌సి గ్రూప్ ఏ కంబైన్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ద్వారా ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈకి ఎంపికయ్యారు. 78 వారాలు వడోదరాలోని నేషనల్ అకాడమి ఆఫ్ ఇండియన్ రైల్వే, సికింద్రాబాద్‌లోని ఇరిసెట్‌లో శిక్షణ పొందారు. సర్ట్ఫికెట్ల ప్రదానోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యా దవ్, రైల్వే బోర్డు టెలికం విభాగం అదనపు సభ్యుడిగా హె చ్‌కె అగర్వాల్, సిగ్నల్ అదనపు సభ్యుడు కాశీనాథ్ పాల్గొన్నారు.