తెలంగాణ

పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడిపై భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ హయత్‌నగర్, జనవరి 20: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిపై గుదిబండలా తయారయ్యాయని, ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి గా విఫలం అయిందని మాజీ హోం మంత్రి సబితారెడ్డి ఆరోపించారు. పెరిగిన ఇందన ధరలను నిరసిస్తూ శనివా రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లో ఎడ్లబండ్లు, సైకిల్, రిక్షాలతో వినూత్న నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. అమలు కానీ హామీలు ఇస్తూ ఆచరించడం లేదని ఆరోపించారు. ఓ వైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా నిత్యావసర ధరలపై భారం పడుతోందని, నియంత్రించకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేష్, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఎడ్లబండి వెళ్తూ నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ హోంమంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు