తెలంగాణ

న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 20: రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర న్యాయశాఖ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని అన్నపూర్ణ గార్డెన్‌లో బార్ అసోసియేషన్ మహబూబ్‌నగర్ జిల్లా శాఖ నిర్వహించిన న్యాయవాదుల సమ్మేళనానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత జితేందర్‌రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని అన్నారు. హైకోర్టు విభజన జరగనందున రాష్ట్రంలో కేసుల విషయంలో, న్యాయవాదులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని దీనిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌లో ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేశారన్నారు.
కేంద్రం దిగివచ్చి హైకోర్టు విభజనకు సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా ఆంధ్రాకు ప్రత్యేకంగా ఇక్కడి నుండి ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది జూన్‌లోగా హైకోర్టు విభజన ఖాయంగా జరిగి తీరుతుందని మంత్రి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.100 కోట్లు కేటాయించడమే కాకుండా హెల్త్‌కార్డులను రాబోయే కాలంలో ఇవ్వనున్నామని ఇందుకు చర్చిస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వమైనా నాలుగు కాలలపాటు మంచిగా కొనసాగాలంటే న్యాయసలహాలు చాలా అవసరమని, న్యాయసలహాలు లేని ప్రభుత్వాలు పనిచేయలేవన్నారు. గతంలో కంటే తెలంగాణ ఆదా యం వృద్ధిరేటు 13శాతం పెరిగిందని తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది యువకులు, ఉద్యమకారులు కేసుల్లో అప్పటి ప్రభుత్వాలు ఇరికించారని, వాటి కేసులను ఇక్కడి న్యాయవాదులు వాదించి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కృషి చేసిన విషయాన్ని మరవలేమన్నారు. సమాజంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజంలో మంచి అనేది ఉంటుందన్నారు.
రాష్ట్రంలో లా అకాడమీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి వెల్లడించారు. అందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని సమెక్య రాష్ట్రంలో ఈ ప్రాంతం తీవ్ర వివక్షతకు గురైందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నామని జూనియర్ న్యాయవాదుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని గతంలో రూ.10వేలు ప్రతి నెలా ఉపకార వేతనం తరహలో ఇవ్వాలని డిమాండ్ ఉందని వాటిపై కూడా పరిశీలిస్తున్నామన్నారు.
ఈ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, చిన్నారెడ్డి, మాజీ న్యాయశాఖ మంత్రి పి.చంద్రశేఖర్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం గోపాల్, న్యాయవాదులు హరిమోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శాంతికుమార్, అరుణకుమారి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో న్యాయవాదుల సమ్మేళనంలో మాట్లాడుతున్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి