తెలంగాణ

‘కాళేశ్వరం’తో లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జనవరి 20: తెలంగాణ రాష్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు దోహదపడే కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, కనె్నపల్లి బార్యేజిలను ఆయన సందర్శించారు. పనుల పురోగతిని గవర్నర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానాకి సంబంధించి సాంకేతిక వివరాలు, వ్యయ అంచనాలు గవర్నర్‌కు వివరించారు. గోదావరి నదీ జలాలను పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రాష్ట్రంలో నలమూల నుండి నిత్యం సరఫరా అయ్యే నీటి వివరాలను గవర్నర్‌కు క్షుణం గా తెలియజేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరగడం, పనులు వేగంగా కొనసాగుతుండటంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల సాగు భూములకు కాళేశ్వరం నీరు అందించటం తమ లక్ష్యమని, గోదావరి నది జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే చర్యలో భాగంగా సరికొత్త సాంకేతిక విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని మంత్రి గవర్నర్‌కు వివరించారు. నీటిని భారీ పంపుల ద్వారా లిఫ్ట్‌చేసే విధంగా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరగడంతోపాటు ఎక్కడా జాప్యం లేకుండా నిరంతరం నిర్మా ణం పనులు జరగటంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసారు. బ్యారేజీలో పంప్‌హౌస్‌ల నుండి నీటి సరఫరా సంబంధించిన వివరాలను మంత్రి హరీష్‌రావు, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు గవర్నర్ నరసింహన్‌కు మ్యాప్‌ల ద్వారా వివరించారు. అంతకుమందు గవర్నర్ హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్ ద్వారా నేరుగా కనె్నపల్లి చేరుకోగానే గవర్నర్ దంపతులకు స్పీకర్ మధుసూదనాచారి, మం త్రి హరీష్‌రావు స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంలో కనె్నపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీలను గవర్నర్ పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీని ఎరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం గవర్నర్ సుందిళ్ల బ్యారేజికి పయనం అయ్యారు. గవర్నర్ రాక సందర్భంగా జయశంకర్ జిల్లా ఎస్పీ భాస్కరన్ నేతృత్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ పర్యటన సాఫీగా సాగడంతో అధికార యం త్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ కార్యక్రమంలో మం థని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, జయశంకర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కర్నన్, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కాళేశ్వరం పనులను పరిశీలిస్తున్న గవర్నర్ దంపతులు, పక్కన మంత్రి హరీశ్‌రావు