తెలంగాణ

తెరాసకు దన్నుగా తెలంగాణ సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 20: పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తెలంగాణ సమాజమంతా ఒక్కటై టీఆర్‌ఎస్ వైపు పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీకులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని నశీంపేట, ఏపూరు గ్రామపంచాయతీ పరిధిలో గల పాండ్యాతండాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 400 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలతో పాటు హమీలివ్వకుండానే ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మూడున్నరేళ్ల సమయంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్రమైన విద్యుత్ కోతలు, చేయూత కరవై సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయరంగంతో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాలు తీవ్రతరమయ్యాయన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని, తీవ్ర విద్యుత్ కొరత నెలకొంటుందని సమైక్యవాదులు కుట్రలతో విషప్రచారం చేశారన్నారు. ఇలాంటి విమర్శలన్నింటినీ ఎదుర్కొని సొంత రాష్ట్రా న్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. కుట్రలను తిప్పికొట్టే రీతిలో రాష్ట్రం లో విద్యుత్‌కోతలకు చరమగీతం పాడి నేడు వ్యవసాయరంగానికి సైతం 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామన్నారు. నేడు రాష్టవ్య్రాప్తంగా ఏమారుమూల తండాలకు వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 500 జనాభా కలిగిన గిరిజన తండాలన్నింటినీ గ్రామపంచాయతీలుగా మార్చుతామని ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు. గిరిజనులు అభ్యున్నతి కోసమే తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతున్నట్టు చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. ఇంటింటికీ మంచినీటిని అందించే లక్ష్యలో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా చేపట్టిన మిషన్ భగీరథ పధకం పనులు నియోజకవర్గంలో 80శాతం పూర్తయ్యాయని మరో రెండు నెలల్లో ఈపథకం ద్వారా మంచినీటిని అందించనున్నట్టు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆత్మకూర్ (ఎస్) ఎంపీపీ కసగాని లక్ష్మి, జడ్పీటీసీ సంపత్‌రాణి, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కాకి కృపాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, కాకి దయాకర్‌రెడ్డి, దండుమైసమ్మ ఆలయ చైర్మన్ బెల్లంకొండ యాదగిరి, వైస్ ఎంపీపీ కంచర్ల వెంకట్‌రెడ్డి, ఏపూర్ సర్పంచ్ దేలీ తదితరులు పాల్గొన్నారు.