తెలంగాణ

హామీలు అటకెక్కాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: టీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ ఐటి విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ ప్రసంగిస్తూ ఐటి సెల్ విభాగాలను రాష్ట్ర స్థాయినుంచి పోలింగ్ కేంద్రం స్థాయివరకూ ఏర్పాటు చేయాలని సూచించారు. టిఆర్‌ఎస్ అస్తశ్రస్త్రాలు ప్రయోగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ కావడానికి ముందు ఐదు రాష్ట్రాల్లోనే బిజెపి అధికారంలో ఉండేదని, ఇప్పుడు 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని చెప్పారు. ప్రధాని మోదీ పట్ల ఇది ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు గుర్తింపని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు కుల, మతాల పేరిట రాజకీయాలు చేస్తున్నదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. సోషల్ మీడియానూ చురుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు.