తెలంగాణ

త్వరలో 10 వేల డాక్టర్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,జనవరి 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వర లో 10వేల డాక్టర్ పోస్టుల నియామకం చేపడుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్, ఐసియూ కేంద్రాలను మంత్రులు జోగురామన్న, ఐకెరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరికి కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నామని, అందులో భాగంగా 10వేల డాక్టర్లను నియమించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. దానికి పోస్టులు సైతం మంజూరయ్యాయని, వీటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని అన్నారు. కాంట్రాక్ట్ వైద్యులుగా పనిచేస్తున్న వారిని నేరుగా రిక్రూట్‌మెంట్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందించేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలో 40 ఆసుపత్రుల్లో తొలిసారిగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రెండు నెలల్లోగా 40 సెంటర్లల్లో సేవలందిస్తామని అన్నారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే పేదలకు అత్యవసర సమయంలో వెంటిలేటర్ కోసం రూ.10వేల నుండి రూ.50వేల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చార్జీలు వేసేవారని, ఇప్పుడు ఆ సమస్య లేదని, పేదల వైద్యం కోసం కష్టాలు పడకుండా ప్రభుత్వం ఆదిలాబాద్, ఉట్నూరులలో ఏర్పాటు చేసిన విధంగానే మంచిర్యాల్, ఆసిఫాబాద్‌లో కూడా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వైద్య సేవలను ఇతర రాష్ట్రాల వారు కూడా అనుసరిస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గతంలో వైద్యం అందక ఎంతోమంది మరణించేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఉట్నూరులో 50 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించి, మరో 50 పడకల ఎన్‌సియును మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ కిట్‌లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విజన్ కార్యక్రమాలు రూపొందించారని అన్నారు. అమ్మ ఒడి తరహాలనే 241 వాహనాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. 108 వాహనాలకు అదనంగా మరో కొన్ని వాహనాలు కేటాయించామని అన్నారు.
తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య చర్యలు చేపట్టి మరణాలను అరికట్టామని, ఇందులో వైద్యుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఏటిడబ్ల్యూ ఏసి చైర్మెన్ కనక లక్కెరావు, జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్యాంనాయక్, వైద్య విధాన పరిషత్ ఓ ఎస్‌డి గంగాధర్, జడ్పీటీసీ జగజీవన్, ఎంపిపి విమల, వైద్య విధాన పరిషత్ ప్రాజెక్టు ఆఫీసర్ అశోక్ కుమార్, నాయకులు దాసండ్ల ప్రభాకర్, కందకూరి రమేష్, మనోహర్, ఆజీమొద్దిన్, సర్పంచ్ బొంత అశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి