తెలంగాణ

ఇంటింటికీ రక్తం మరకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 22: శాస్తస్రాంకేతిక రంగాల్లో దేశం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక సమాజంలోనూ మూడ నమ్మకాల జాడ్యం గ్రామీణ ప్రాంతాలను వీడడంలేదు. చేతబడులు, బాణామతులంటూ పూజలు, బలుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే తరహలో గుర్తుతెలియని వ్యక్తులు గిరిజనతండాలో ఇంటింటికీ రక్తపు మరకలు చల్లివెళ్లిన ఘటన ఆదివారం రాత్రి చివ్వెంల మండలంలోని రోళ్లబండతండాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తండాలో ఉన్న 70 నివాసాల ముందు రక్తాన్ని చల్లారు. గ్రామశివారులో ఉన్న శ్రీరాంసాగర్ కాలువ వద్ద నుండి రక్తం చల్లుతూ గ్రామంలోని అన్ని ఇండ్లకు రక్తపు మరకలు అంటించారు. మెట్లున్న ఇళ్లకు ఇంటిపైకెక్కి రక్తం చల్లగా మెట్లులేని ఇళ్ల ముందు చల్లారు. తలపులు, గేట్లు తీసిఉన్న వారి ఇళ్ల లోపలికి వెళ్లిమరీ రక్తం చల్లారు. సోమవారం ఉదయం రక్తపు మరకలను గమనించిన గ్రామస్థులు ఆందోళన చెందారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు రక్తం చల్లినట్లుగా గుర్తించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామస్థులందరికీ మూకుమ్మడిగా చేతబడిచేసి రక్తం చల్లి ఉంటారని భయపడుతున్నారు. ప్రతి ఇంటికీ రక్తపు మరకలు అంటించడం వల్ల వేరే గ్రామాలకు చెందిన వారే ఈఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామస్థులంతా ఈఘటనపై చర్చించుకొని వేదపండితులను సంప్రదించి గ్రామంలో ప్రత్యేక పూజలు చేయించాలని, గ్రామదేవతలకు పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం కావడం వల్ల చేతబడి చేసి రక్తం చల్లి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు మాత్రం గ్రామంలోకి రాలేదని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.