తెలంగాణ

నాయి బ్రాహ్మణులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: నాయి బ్రాహ్మణులకు ప్రత్యేకంగా వృత్తి పరమైన నైపుణ్యాలను పెంచే చర్యలు చేపట్టినట్టు బిసి సంక్షేమ కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం చెప్పారు. 31 జిల్లాల నుండి 650 మందిని ఎంపిక చేశామని, వారికి తెలంగాణలోని ఆరు అకాడమిల్లో శిక్షణ ఇస్తామని తెలిదారు. హెయిర్ స్టైల్, బ్యూటిఫికేషన్ కోర్సుల్లో 15 రోజుల పాటు ఆధునిక శిక్షణ ఇస్తామని చెప్పారు. దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి సంక్షేమ శాఖ కమిషనర్ అనిత రాజేంద్ర, ఉన్నతాధికారులు సైదా, చంద్రశేఖర్, అలోక్ కుమార్, మల్లయ్య భట్టు పాల్గొన్నారు.