తెలంగాణ

10 మంది స్టేట్ క్యాడర్ అధికారులకు ఐఏఎస్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్‌కు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్ సెక్రటరీ పంకజ్ గంగ్వార్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐఏఎస్ హోదా లభించినవారిలో కొర్రాలక్ష్మి, కె. ధర్మారెడ్డి, చిట్టెం లక్ష్మి, టి. వినయ్‌కృష్ణారెడ్డి, సిహెచ్. శివలింగయ్య, వి. వెంకటేశ్వర్లు, ఎం. హనుమంతరావు, డి.అమోయ్ కుమార్, కె. హైమావతి, ఎం. హరిత ఉన్నారు.