తెలంగాణ

ఆర్టికల్ 370ను రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 23: జమ్ముకాశ్మీర్‌లో ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీంసింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మొత్తం ఒకే చట్టం అమలు అవుతుండగా కేవలం జమ్ముకాశ్మీర్‌లో ప్రత్యేక చట్టం అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ చట్టంవల్ల ఎంతోమంది కాశ్మీరి యువకులు జైళ్లలో మగ్గాల్సి వస్తుందన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉన్న ఈ ఆర్టికల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్టు భీంసింగ్ పేర్కొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న భీంసింగ్