తెలంగాణ

ఏసీబీ వలలో ఆర్డీఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జనవరి 23: నలభై వేల రూపాయల లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్‌డీఓ బాలే శ్రీనివాస్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంజీరా వాటర్ ప్లాంట్ యజమాని బదాం రాజ్‌కుమార్ నుంచి ఆర్‌డీఓ లంచం తీసు కొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం ఆర్మూర్‌లో సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. మూడు నెలల క్రితం ఆర్మూర్ ఆర్‌డీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 16 వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఆ సమయంలో వాటర్ ప్లాంట్లను తెరవడం కోసం ఆర్‌డీఓ శ్రీనివాస్ ఓ మండల టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధి ద్వారా 80 వేల రూపాయ లు తీసుకున్నాడని, మూడు నెలల తర్వాత మళ్లీ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశాడని మంజీర వాటర్ ప్లాంట్ యజమాని బదాం రాజ్‌కుమార్ తెలిపారు. వాటర్ ప్లాంట్లను తెరవాలంటే మళ్లీ 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆర్‌డీఓ చెప్పాడని అన్నా రు. చివరకు 40 వేల రూపాయలకు ఒప్పం దం కుదిరిందని అన్నా రు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. వాటర్ ప్లాంట్ల అసోసియేషన్ యజమానులందరం చర్చించుకొని డబ్బులిచ్చేది లేదని నిర్ణయించుకున్నామని అన్నారు. ఆ తర్వాత తాను నేరుగా హైదరాబాద్ వెళ్లి ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావును కలిసినట్లు ఆయన తెలిపారు. కాగా మంగళవారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని జడ్పీ మాజీ చైర్మన్ గంట సదానందం ఇంటి పక్కన గల ఇంట్లో మొదటి అంతస్థులో కిరాయికి ఉండే ఆర్‌డీఓ బాలే శ్రీనివాస్‌ను వాటర్ ప్లాంట్ యజమాని బదాం రాజ్‌కుమార్ వద్ద నుంచి 40 వేల రూపాయలు తీసుకుంటున్న సందర్భంలో ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.రమణకుమార్, కరీంనగర్ డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐలు సతీష్‌కుమార్, వేణుగోపాల్, రమేష్‌రెడ్డిల బృం దం పక్కా పథకం ప్రకారం ఆర్మూర్ ఆర్‌డీఓ బాలే శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్మూర్ తొలి ఆర్‌డీఓ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

చిత్రాలు..పట్టుబడ్డ ఆర్‌డీఓ శ్రీనివాస్‌ *బాధితుడు రాజ్‌కుమార్