తెలంగాణ

ఫీడర్ సర్వీసులను మెరుగుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే మహానగరవాసులకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 30కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లో ఫీడర్ సర్వీసులను మెరుగుపర్చాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌పీ సింగ్ ఆదేశించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ మంగళవారం మెట్రో, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు, అక్కడి నుంచి మియాపూర్ వరకు విద్యుత్‌తో నడిచే కాలుష్యం లేని వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. అంతేగాక, మెట్రో రైళ్ల రాకపోకల వేళలకు అనుగుణంగా ఆర్టీసి సేవలను కూడా అనుసంధానం చేసి, తగిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు గాను వెంటనే ఓ అధ్యయనాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ అధ్యయనంలో భాగంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలు కారిడార్‌లోని అన్ని స్టేషన్లలో ప్రయాణికులకు కావల్సిన ఫీడర్, కనెక్టివిటీ సర్వీసులకు సంబంధించిన వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం నిర్వహించాలని అన్నారు. అందుబాటులోకి వచ్చిన అన్ని స్టేషన్లకు ప్రయాణికులకు ఫీడర్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేలా ఈ అధ్యయనం ఉండాలని అన్నారు. మెట్రో మొదటి దశను ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి చేయాలని, అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు 16కిలోమీటర్ల మేరకు, అలాగే అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు పది కిలోమీటర్ల మెట్రో మూడో కారిడార్‌ను దశల వారీగా వచ్చే జూన్ నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పనులు జరగాలని మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్‌రెడ్డికి సూచించారు. అలాగే మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేసి, సన్నాహాక పనులను ప్రారంభించాలని సూచించారు. మెట్రో రెండో దశకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు సింగ్ వివరించారు. రెండో దశ పనులకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్, రంగారెడ్డి,సంగారెడ్డి, మెడ్చల్ జిల్లా కలెక్టర్లు, అలాగే ఎల్ అండ్ టీ సీనియర్ అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచుకోవల్సిన అవసరముందని సూచించారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, కలెక్టర్లు యోగితారాణా, డా.ఎం.వీ.రెడ్డి, ఎల్ అండ్ టీ హెచ్‌ఎంఆర్‌ఎల్ సీఈ కేవీబీ రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..మెట్రోరైలు ఫీడర్ సర్వీసులు, రెండో దశపై సమీక్ష నిర్వహిస్తున్న చీఫ్ సెక్రటరీ ఎస్‌పీ సింగ్