తెలంగాణ

జేఏసీలో పార్టీలకు నో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 23 : జేఏసీలో ఎలాంటి రాజకీయ పార్టీలకు చోటు లేదని.. ప్రజాసంఘాలకు మాత్రమే స్థానం ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. మంగళవారం టీజేఏసీ చైర్మన్ మంచిర్యాల సదస్సుకు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట రంగధాంపల్లి జిల్లా ఫోరం నేతలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా ఆరవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఆనంతరం రంగధాంపల్లి వద్ద జేఏసీ చైర్మన్ కోదండరాం విలేఖరులతో మాట్లాడారు. సమాజంలో పౌర ప్రజాసంఘాల పాత్ర చారిత్రాత్మకమైందన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ రాష్ట్ర సాధన, బ్రిటన్, ఫ్రెంచ్, అమెరికా దేశాల్లో సైతం పౌరవేదికలు ప్రధా న భూమిక నిర్వహించినట్లు రుజువైందన్నారు. ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లేలా రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు చేరేటట్లు కృషిచేస్తున్న పౌరసంఘాల పాత్ర అద్వితీయమన్నారు. పౌర, ప్రజాసంఘాలపై నిర్బంధం విధిస్తూ పాలన సాగించటం ప్రజాస్వామ్యం కాదన్నారు. నిర్బంధాలు తెలంగాణకు కొత్త కాదని ఆయన స్పష్టం చేశారు. నవ తెలంగాణ నిర్మాణంలో జేఏసీ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ నవసమాజ నిర్మాణంలో జేఏసీ క్రీయశీలకంగా పాలుపంచుకుంటోందని, ఇది తెలంగాణ ప్రజల శక్తి అన్నారు. పౌరవేదికలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బద్ధంగా కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే అని స్పష్టం చేశారు. ఇటీవల పౌరవేదికలను ప్రభుత్వం అడ్డుకొని ఆంక్షలు విధించటం బాధకరమన్నారు. ప్రజాసమస్యలపై పోరాడే మందకృష్ణ, వంటేరు ప్రతాప్‌రెడ్డి లాంటి నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే పౌరవేదికలకు అనుమతులు ఇవ్వటం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. సిద్దిపేట జిల్లా ఫోరం గత ఆరుసంవత్సరాలుగా ప్రజాసమస్యల పరిష్కార కోసం ఒక పౌర సంఘంగా చేస్తు న్న పోరాటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి బైరి నర్సింలు, చంద్రారెడ్డి, శివకుమార్, జగదీశ్వర్, రాజేంద్రప్రసాద్, సుధాకర్ జనార్దన్, జేఏసీ సిద్దిపేట జిల్లా చైర్మన్ బాపురావు, టీవివి జిల్లా అధ్యక్షుడు పెద్దిరాజు, జేఏసీ జిల్లా నేతలు శ్రీనివాస్, వెంకటేశం, నవీన్, పున్నంరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం