రాష్ట్రీయం

కల్తీమద్యం ఘటనపై సిట్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: విజయవాడ కల్తీ మద్యం ఘటనపై 9 మంది సీనియర్ అధికారులతో స్పెషల్ ఇన్విస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను నియమించినట్టు అబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం నాడు శాసనసభలో వెల్లడించారు. 74వ నిబంధన కింద కల్తీ మద్యం అంశంపై పి శ్రీనివాసరెడ్డి , గద్దె రామమోహనరావు తదితరులు ఇచ్చిన నోటీసుకు మంత్రి బదులిచ్చారు. సిట్‌కు మహేష్‌కుమార్ లడ్డా , సెంథిల్ కుమార్ తదితరులు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. మద్యం వ్యాపారుల్లో ఎక్కువ మంది వైకాపా నేతలే ఉన్నారని చెప్పారు. గత 7వ తేదీన విజయవాడ స్వర్ణబార్‌లో కల్తీ మద్యం వల్ల ఐదుగురు మరణించారని, 39 మంది అస్వస్థులయ్యారని చెప్పారు. 9 రకాల బ్రాండ్లను రద్దు చేశామని, బార్‌ను సీజ్ చేశామని, ఘటనకు సంబంధించి 9 మందిపై కేసులు నమోదుచేశామని పేర్కొన్నారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మద్యం షాప్‌లకు ఆక్షన్ పద్ధతి ప్రవేశపెట్టడం వల్లనే విచ్చలవిడితనం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని బార్లు తనిఖీ చేసి 83 కేసులను నమోదుచేశామని, నాశిరకం మద్యం అమ్ముతున్న ఆరు షాప్‌లపై కేసులు పెట్టామని చెప్పారు. టాస్క్ఫోర్సు బృందాలు మరో 18 కేసులు పెట్టాయని, ముగ్గురు ఎక్సైజ్ ఎస్‌ఐలను సస్పెండ్ చేశామని, మిగిలిన సీనియర్ అధికారులకు షోకాజ్‌లు ఇచ్చామని చెప్పారు.
ఈ సందర్భంగా గద్దె రామమోహనరావు మాట్లాడుతూ ఈ ఘటనతో పేదలు ప్రాణాలతో కొట్టుమిట్టాడారని, సిఎం చొరవతో మంచి వైద్య సదుపాయాలు కల్పించి 34 మందిని ప్రాణాలతో రక్షించామని అన్నారు. విజయవాడ నగరాన్ని క్రైమ్ నగరంగా చూపించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని, మృతులు ఎక్కువగా ఉండాలనే రాక్షస ఆనందాన్ని పొందాలని చూశారని పేర్కొన్నారు. నిజానికి విజయవాడ నగరంలో నేరాలు తగ్గాయని, 2014లో నేరాలు 7500 కాగా, ఈ ఏడాది 5500 మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. నేరాలు పెరిగిపోయాయని అవాస్తవాలు చెప్పి అపఖ్యాతికి ప్రయత్నిస్తున్నారని చివరికి ఆధారాలు నిరూపించలేక పలాయనం చిత్తగించారని చెప్పారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ బార్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజమండ్రిలో జరిగిన కల్తీ మద్యం కేసులో అప్పటి కాంగ్రెస్ నేత జక్కంపూడి రామమోహనరావు ఉన్నారని, విజయవాడ ఘటనలో మల్లాది విష్ణు ఉన్నారని, విజయనగరంలో తాము మద్యం వ్యాపారం చేస్తున్నట్టు అప్పటి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించారని, మద్యం వ్యాపారుల్లో ఎక్కువ మంది వైకాపా నేతలేనని అన్నారు. ఆనాడు ఎసిబి నివేదికలో కూడా నేతల ప్రమేయాన్ని అధికారులు గుర్తించారని చెప్పారు. పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మద్యం మాఫియా వ్యక్తులను పార్టీలో చేర్చుకున్న జగన్‌కు మద్యంపై మాట్లాడే హక్కు లేదని అన్నారు.
కమిటీలు వేసినప్పుడు ఎమ్మెల్యేలు గుర్తురారా?
-బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
రాష్ట్రంలో ఏదైనా విపత్తు సంభవించినపుడు దాని పరిష్కారానికి శాసనసభ్యులు బాధ్యత తీసుకుంటున్నా, ప్రభుత్వం మాత్రం విపత్తు యాజమాన్యాలపై కమిటీలు వేసినపుడు వారికి ఎమ్మెల్యేలు గుర్తుకురావడం లేదని బిజెపి ఎమ్మెల్యే పి విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. మంగళవారం నాడు శాసనసభలో 74వ నిబంధన కింద విశాఖలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించిన ఘటనపై ప్రస్తావన చేసినపుడు ఉప ముఖ్యమంత్రి ఎన్ చిన్నరాజప్ప సమాధానం చెబుతూ బాధితులకు లక్ష రూపాయిలు చొప్పున పరిహారం అందించామని, ఇక మీదట అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కమిటీల్లో సభ్యులుగా నియమించినా, లేకున్నా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.