తెలంగాణ

రోడ్డు ప్రమాదంలోనే దేవి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ఇంజనీరింగ్ విద్యార్థిని కె.దేవిరెడ్డి మృతికి రోడ్డు ప్రమాదమే కారణమని తెలుస్తోంది. లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే తమ కుమార్తెను హత్య చేశారని, కనుక ఈ కోణంలో దర్యాప్తు జరపాలని దేవిరెడ్డి తల్లితండ్రులు సిపిని కలిసి కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఫోరెనిక్స్, మోటారు వాహనాల నిపుణులతో కలిసి రెండోసారి దర్యాప్తు జరిపినప్పటికీ దేవిరెడ్డి హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దేవిరెడ్డి ప్రయాణించిన కారు ధ్వంసమైన తీరు, ఆ కారులో ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ ఆమె తలకు బలమైన గాయాలు తగలటం తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులతో కలసి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపారు. రోడ్డు ప్రమాదం వల్లనే ఇటువంటి గాయాలు అవుతాయని ఫోరెనిక్స్ బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ నరసింహారెడ్డితో గత సంవత్సరం నుండి దాదాపు 1500 మంది వివిధ సందర్భాల్లో టచ్‌లో ఉన్న ట్టు ఆయన ఫోన్ కాల్ డేటాను బట్టి తెలియడంతో వీరందరి టవర్ లొకేషన్స్‌ను పోలీసు లు విశే్లషించారు. అ యితే ప్రమాదానికి ముందు గానీ, తర్వాత గానీ ఈ 1500 మంది ఆ పరిసర ప్రాంతాల్లో లేనట్టు తేలింది. అలా గే ప్రమాదానికి ముందు దేవిరెడ్డి ప్రయాణించిన మార్గాల్లోని దాదాపు 50 సీసీ కెమెరాల ఫుటేజ్‌లతో పాటు ఆమె ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ ఫోటోలు, మెసేజ్‌లను సైతం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం తో గత ఎనిమిది నెల ల నుంచి భరత్ సిం హారెడ్డి, దేవీ టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్‌లోని పబ్ నుంచి తెల్లవారు జామున 3 గంటల 33 నిమిషాల ప్రాంతంలో బయలుదేరిన భరత్ సింహారెడ్డితో పాటు దేవిరెడ్డి స్నేహితులు వెంకట్, పృథ్వీ, విశ్వనాథ్, అలాగే సోనాలి అనే యువతి సెల్‌ఫోన్ టవర్ లొకేషన్లు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేవిరెడ్డితో కలసి పబ్ నుంచి కారులో బయలుదేరిన భరత్ సింహారెడ్డి తాగిన మైకంలో కారును అతివేగంగా నడపడంతో కేవలం 11 నిమిషాల్లోనే జర్నలిస్టు కాలనీకి చేరుకున్నట్లు అక్కడున్న ఒక పత్రికా కార్యాలయ సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది. తెల్లవారు జామున 3.44 నిమిషాలకు వీరి కారు అత్యంత వేగంగా దూసుకెళ్తున్నట్లు ఆ ఫుటేజ్‌లో కనిపించింది. దేవీ తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడేందుకు కొద్దిదూరంలోనే ఐదు నిమిషాలపాటు కారును నిలిపివేసినట్లు కూడా టవర్ సిగ్నల్స్ ద్వారా వెల్లడైంది. అప్పటికే ఇంటి నుంచి ఫోన్లు వస్తుండటంతో భరత్ సింహారెడ్డి కారు వేగాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నించాడని, దీంతో ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.