రాష్ట్రీయం

రాష్ట్ర శ్రేయస్సు కోసమే టిడిపిలోకి చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, నవంబర్ 27: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని, రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని ఏసి సెంటర్‌లో ఆనం సోదరులు భవిష్యత్ రాజకీయాలపై తన అనుచరులతో ఆత్మీయ సదస్సును నిర్వహించారు. పార్టీతో సంబంధం లేకుండా ఆనం సోదరులకు జిల్లాలో తమకుంటూ ఒక కేడర్ ఉండటంతో వారి పిలుపు మేరకు తమకు పార్టీతో సంబంధం లేదని మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ప్రకారమే తాము నడుస్తామని అభిమానులు బహిరంగంగా చెప్పారు. దీంతో ఆనం సోదరులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ముందుగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఒక తరం నష్టపోతామని అధిష్టానానికి చెప్పినా తమ మాట లెక్క చేయకుండా మొండిగా వ్యవహరించారన్నారు. విభజన అంశం ప్రజలకు బాధ కలిగించినందువల్లే కాంగ్రెస్ పార్టీని ఓడించారన్నారు. తమకు ఓటమి తప్పదని తెలిసినా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేశామన్నారు. ప్రజలకు తమపై కక్షలేదని, కాంగ్రెస్ పార్టీపై ద్వేషమే తమ ఓటమికి కారణమని తాము భావిస్తున్నామన్నారు. అధికారం కోసం పార్టీని మారాల్సిన అవసరం తమకు లేదన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని, నమ్ముకున్న వారి కోసం , తమ వెంట నడిచే కార్యకర్తల కోసం, రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలంటే ఒక ఉన్నతమైన నాయకత్వం కలిగిన పార్టీలో ఉండాలని కార్యకర్తలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు కన్నా రాష్ట్ర అభివృద్ధిపై అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంట తాము నడవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ తమకు రాజకీయాలు కన్నా ప్రజా శ్రేయస్సు ముఖ్యం అన్నారు. తాము ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతామని తెలిసినా పోటీ చేశామన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చూశామని అయితే అధిష్టానం గ్రూపులు కడతుందని తెలిసి ఇక ఆ పార్టీలో కొనసాగడం తమ వల్ల కాదని నిర్ణయించుకున్నామన్నారు.