రాష్ట్రీయం

టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ 9 తొలి కీ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ 09/2015 ద్వారా ఈ నెల 7వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్లు (సివిల్ మెకానికల్) పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ కీని కమిషన్ విడుదల చేసింది. ఈ కీ 23వ తేదీ నుండి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. తొలి కీపై ఎమైనా అభ్యంతరాలుంటే 25లోగా వాటిని కమిషన్‌కు తెలియజేయాలని కమిషన్ కార్యదర్శి సూచించారు.

ఐసిడి బల్బులకు వత్తిడి చేయవద్దు!
హైదరాబాద్, నవంబర్ 21: తూర్పు, సదరన్ పవర్ డిస్కాంలలో విద్యుత్ వినియోగదారులను ఐసిడి బల్బులు తిరిగి ఇవ్వాలని బలవంతం చేయరాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా ఎల్‌ఇడి బల్బులను వినియోగదారులకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినియోగదారులను ఐసిడి బల్బులు వాపసు చేయాలని వత్తిడి చేయరాదని ఏపిఇఆర్‌సి సూచించింది. అనంతరం ఈ అంశంపై విచారణను డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేస్తూ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.