తెలంగాణ

ఉద్యమాలతోనే స్వయంపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జనవరి 3: పాలకులు, ప్రభుత్వాలు మారినా గిరిజనుల చట్టాలు మాత్రం దేశంలో ఎక్కడా అమలు జరగడంలేదని, అన్నిరంగాల్లో దారిద్రాన్ని అనుభవిస్తున్న ఆదివాసీ గిరిజనులు హక్కుల పరిరక్షణ, స్వయంపాలన కోసం ఉద్యమాలబాట పట్టాలని త్రిపుర మాజీమంత్రి, పార్లమెంట్ సభ్యులు జితిన్ చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం ఉట్నూరులోని బిడి శర్మ ప్రాంగణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ప్రథమ మహాసభలకు వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున గిరిజనులు తరలివచ్చి హక్కుల కోసం కదం తొక్కారు. ఈ సందర్భంగా మహాసభల్లో ముఖ్యఅతిథిగా హాజరైన జితిన్ చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజనుల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా ప్రభుత్వాలు అమలుపర్చకుండా వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన చట్టాలను, విశేష ఆధికారాలను అమలుపర్చాల్సిన గవర్నర్లు ఉత్సవ విగ్రహాల్లాగానే మిగిలిపోతున్నారని, గవర్నర్ల చేతికి కట్టబెట్టిన 5వ షెడ్యూల్‌ను తొలగించి, గిరిజనుల స్వయంపాలన కోసం 6వ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీల రక్షణ, హక్కుల కోసం రూపొందించిన పీసాచట్టం అమలుకునోచుకోవడం లేదని పేర్కొన్నారు. నిరక్షరాస్యత అధికంగా ఉన్న గిరిజనుల్లో సాధికారత సాధించేందుకు ప్రభుత్వాలు ముందుకురావడంలేదని, దీంతో అభివృద్ధిలో మరింత వెనకబడిపోతున్నారని జితిన్ చౌదరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మన్‌కీబాత్ కార్యక్రమంలో ఆదివాసీల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు.
దేశవ్యాప్తంగా గిరిజన విద్యార్థులకు రావాల్సిన 70 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సున్నం రాజయ్య, జాతీయ కన్వీనర్ మిడియం బాబురావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల మనుగడ కోసం రూపొందించిన 1/70 చట్టాలను పకడ్బందీగా అమలుపర్చే వరకు, గిరిజనులు పంచాయతీల్లో స్వయం పాలన సాగించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆదివాసి గిరిజనులు ఐక్యంగా పోరాడుతూ ప్రభుత్వాలను నిలదీయాలని ఈ సభలో పిలుపునిచ్చారు. ఈ మహాసభల సందర్భంగా ఆదివాసీ గిరిజనులు ఉట్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.వెంకట్, రాష్ట్ర ఐద్వా ప్రధాన కార్యదర్శి హైమావతి, గిరిజన సంఘం నాయకులు బండారు రవికుమార్, సోమయ్య, బుగ్గికృష్ణ, తొడసం భీంరావు తదితరులు పాల్గొన్నారు.