11న తులసీదళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్చల్, వందనాగుప్త ప్రధాన తారాగణంగా కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తులసీదళం’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్నాటక, ఒడిశా, అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలలో విడుదల చేస్తున్నామని తెలిపారు. హారర్ సినిమా అంటే రాత్రివేళ చిత్రీకరిస్తారని, కానీ ఈ సినిమాను ప్రపంచంలో అత్యధిక వెలుతురుగల ప్రాంతమైన లాస్‌విల్లాస్‌లో షూటింగ్ చేశామని, ఆ ప్రాంతంలో ఎప్పుడూ లైట్ వుంటూనే వుంటుందని తెలిపారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని ఎమోషన్లతో ఈ సినిమా రూపొందించామని, అయితే యండమూరి వీరేంద్రనాధ్ రాసిన నవలకు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రతి ప్రేమకు ఓ సమస్య వున్నట్లుగా ఈ సినిమాలో ప్రేమకథకు హారర్ సమస్య వుంటుందని ఆయన తెలిపారు. 45 రోజులపాటు అందరం కలిసి ఈ చిత్రం కోసం పనిచేశామని, ఈనెల 11న విడుదల కానుందని కథానాయకుడు నిశ్చల్ అన్నారు. 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో అచ్చిబాబు, దీపక్ రావెళ్ల, అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు మాటలు:తిరుమల నాగ్, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా:శరత్ మండవ, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం:ఆర్.పి.పట్నాయక్.