తెలంగాణ

భద్రాద్రి అధికారులపై మంత్రి తుమ్మల నిప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: శ్రీరామనవమి సమీపిస్తున్నప్పటికీ భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో పనులు పూర్తికానందుకు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి దేవస్థానం ఇవో కె.జ్యోతి, డిఇ రవీంద్రనాథ్‌లపై మండిపడ్డారు. భక్తుల కోసం నిర్మిస్తున్న చలువ పందిళ్లపై తాటాకులు సరిగా వేయలేదని మంత్రి కోపగించుకున్నారు. రెండు ఆకులు పడేస్తే చలువపందిళ్లు అవుతాయా? అని ఇవోను నిలదీశారు. ఆలయ పరిసరాల్లో ఇంకా చెత్తాచెదారాన్ని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఇవో, డిఈలను దేవాదాయశాఖకు సరెండర్ చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.