రివ్యూ

ట్రాక్ తప్పిన రీమేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*తుంటరి (బాగోలేదు)

తారాగణం:
నారా రోహిత్, లతాహెగ్డే, వెనె్నల కిషోర్, తదితరులు.
నిర్మాతలు:
అశోక్, నాగార్జున
సంగీతం:
సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ:
పళనికుమార్
దర్శకత్వం:
కుమార్ నాగేంద్ర

సోలో వంటి విజయం తరువాత విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు నారా రోహిత్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘తుంటరి’. లతాహెగ్డే హీరోయిన్. తమిళంలో హిట్టయిన మాన్ కరాటే చిత్రానికి రిమేక్. మురుగదాస్ అందించిన కథతో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు రోహిత్. గుండెల్లోగోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిందో లేదో చూద్దాం!
కథ:
కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులు సెలవులకు హిల్ స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ వాళ్లకు ఓ సన్యాసి కనిపించి తనకు భవిష్యత్ తెలుసని అంటాడు. ఆ విషయాన్ని నమ్మించడానికి వాళ్లకు నాలుగునెలల తరువాత రాబోయే న్యూస్ పేపర్‌ను ఇస్తాడు. ఆ పేపర్‌ను చదివిన వాళ్ళకు రాజు (రోహిత్) అనే వ్యక్తి ద్వారా వాళ్ళు బాక్సింగ్ పోటీల్లో నెగ్గి 5 కోట్లు గెలుచుకుంటారని తెలుస్తుంది. ఎలాంటి పనీ పాటా లేకుండా ఫ్రెండ్ కిషోర్ (వెనె్నల కిషోర్)తో కలిసి ఆవారాగా తిరిగే కుర్రాడే మన హీరో రాజు(నారా రోహిత్). రాజు ఒకసారి సిరి (లతాహెగ్డే)ని చూసి ప్రేమలో పడతాడు. తనని ఎలాగోలా పడేయాలని చూస్తున్న టైంలో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ అయిన పూజిత అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ రాజుని వెతుక్కుంటూ వస్తుంది. తను ఆ ఏడాది జరిగే కిక్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పార్టిసిపేట్ చెయ్యాలని ఫోర్స్ చేస్తారు. కానీ తనకి రాదని రాజు ఒప్పుకోడు. తనకి అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని, డబ్బులతోపాటు తనకి కావాల్సినవన్నీ చేసి పెడతామని చెప్పి రాజుని బాక్సింగ్‌కి ఒప్పిస్తారు. రాజు మొదటగా సిరి తనని ప్రేమించేలా చేయమని కండిషన్ పెడతాడు. ఫైనల్‌గా ఎలాగోలా చేసి రాజుని- సిరిని ఒకటి చేస్తారు. రాజు పెద్ద సీరియస్‌గా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోకపోయినా వరుసగా మ్యాచ్‌లన్నీ గెలుచుకుంటూ వస్తుంటాడు. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ డేంజరస్ కిక్‌బాక్సర్ అయిన రాజు ది కిల్లర్ (కబీర్ దూహాన్‌సింగ్)తో పడుతుంది. అప్పటిదాకా సాదాగా తీసుకున్న రాజు బాక్సింగ్ లైఫ్ సీరియస్‌గా మారుతుంది. అదే టైంలో అన్ని రోజులు సపోర్ట్ చేసిన పూజిత అండ్ ఫ్రెండ్స్ కూడా రాజుని వదిలి వెళ్ళిపోతాడు. ఇక అక్కడినుంచి కథ ఎలా ముందుకు సాగింది? ఫైనల్స్‌లో రాజు గెలిచాడా? లేదా? పూజిత అండ్ ఫ్రెండ్స్ ఏ కారణంచేత వదిలేసి వెళ్ళిపోయారు అనే సమాధానాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే..
నటీనటుల్లో సినిమాకి హెల్ప్ అయ్యింది, అలాగే కొన్ని కొన్ని యాంగిల్స్‌లో నెగటివ్ అయ్యేలా అనిపించేది కూడా హీరోనే. నారా రోహిత్ తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, పాత్రకి కావాల్సిన మానరిజమ్స్‌పరంగా బెస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఎక్స్‌ప్రెషన్స్‌పరంగా ఫస్ట్‌హాఫ్ బాగున్నా సెకండాఫ్‌కి వచ్చేసరికి అవే ఎక్స్‌ప్రెషన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లుక్‌పరంగా అయితే నారా రోహిత్ బాగా లావుగా బొద్దుగా కనిపిస్తున్నాడు. దానివలన కొన్ని సీన్స్‌లో కావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. లతాహెగ్డేకి చాలా చిన్న పాత్ర. అందుకే లవ్ ట్రాక్‌పరంగా మాత్రం బాగా చేసింది. వెనె్నలకిషోర్, పూజిత పాత్ర పరిథి మేరకు చేశారు. అంతేకాకుండా తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇక విలన్‌గా చేసిన కబీర్‌సింగ్ పాత్రని ఒరిజినల్ వెర్షన్‌తో పోల్చుకుంటే కాస్త తగ్గించారు. అందుకే ఆ పాత్ర అంత ఎఫెక్టివ్‌గా లేదు. కానీ ఉన్నంతలో కబీర్ బాగా చేశాడు. అతిథి పాత్రల్లో కనిపించినా సినిమాలో నవ్వులు పూయించింది మాత్రం అలీ, షకలక శంకర్‌లే అని చెప్పాలి. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.
ఈమధ్య యంగ్ డైరెక్టర్లు కొత్త కథలు అందించే ప్రయత్నం చేస్తున్నా, రాసుకున్నంత ఎఫెక్టివ్‌గా చూపించడంతో విఫలమవుతున్నారు. అలాంటి జాబితాలో చేరిపోయే సినిమానే ‘తుంటరి’. ఎందుకంటే ఇదొక తమిళ హిట్ సినిమా (మాన్ కరాటే)కి రీమేక్. కథాపరంగా బాగున్నా తెరపైకి వచ్చేసరికి తేలిపోయింది. 2 గంటల సినిమానే అయినా తెలుగువెర్షన్ స్క్రీన్‌ప్లేవల్ల సినిమా బోరింగ్ అనిపిస్తుంది. నారా రోహిత్ ఎప్పుడు కబీర్‌సింగ్‌తో ఢీకొట్టాలి అనే అనౌన్స్‌మెంట్ వస్తుందో అప్పుడే కథలో ఊపొస్తుంది.
ఇంటర్వెల్ తర్వాత సినిమా స్లో అయిపోయింది. ఇరికించిన కామెడీ సీన్లు, పాటలు, రొమాంటిక్ ట్రాక్, వర్కవుట్‌కాని ఎమోషనల్ ఎపిసోడ్స్ చిరాకు పెట్టాయి. చివరి 40 నిమిషాలు సాగదీశారు. ఎమోషనల్ క్లైమాక్స్ ఆడియన్స్‌కి కనెక్టవ్వలేదు. క్లైమాక్స్‌లో హీరో రోహిత్ తన పాత్రకి జస్ట్ఫికేషన్ ఇవ్వలేకపోయాడు. సక్సెస్‌ఫుల్ స్టోరీని సింపుల్‌గా తీసుకోవడంలో డైరెక్టర్ వైఫల్యం కనిపిస్తుంది. టెక్నికల్ టీంలో పళని కుమార్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. లోకల్ ఏరియా కలర్‌ఫుల్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సాయికార్తీక్ కంపోజ్ చేసిన ఆల్బంలో రెండు పాటలు ఓకే. నేపథ్య సంగీతం బాగుంది. మురళి కొండేటి ఆర్ట్ వర్క్ డీసెంట్‌గా ఉంది. వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

-త్రివేది