డైలీ సీరియల్

ట్విన్‌టవర్స్ 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవిడ ఆ మాట అనగానే గబగబా పైకి వెళ్లాను. అతనూ నా కోసమే ఎదురుచూస్తున్నాడు. ‘ఇంతసేపు ఏం చేస్తున్నావ్?’ అన్నాడు కొంచెం చిరాగ్గా.
‘‘మీరు పిలవాల్సింది’’ అన్నాడు.
‘‘నేనా?’’ అంతమంది మధ్యలోంచి ఎలా పిలుస్తాననుకున్నావు?’’ అన్నాడు.
అంతమంది మధ్యనుండి తనెలా వస్తాననుకున్నాడు? అనుకున్నాను మనసులోనే. అయినా ఏమీ సమాధానం ఇవ్వకుండా, అతని వంకే చూశాను. నా చూపులోనే అర్ధం అయిపోయిందేమో, మరింకేమీ మాట్లాడలేదు.
సూట్‌కేస్ తాళం నొక్కి, లేచి నాకు దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు మొదటిరోజు కలిగిన భయం కలగలేదు. రెండు చేతులూ భుజాలమీద వేసి కొద్ది క్షణాలు తదేకంగా చూశాడు. వెంటనే పూర్తిగాగా చేతులతో చుట్టేసి, దగ్గరకు లాక్కుని, మెడ వంపుల్లో తల ఉంచుకున్నాడు. అలా ఎన్ని నిమిషాలు గడిచాయో తెలియదు. అతను పట్టుకున్న తీరులో నా చేతులు కూడా కదిలేటట్లు లేవు.
తల ఎత్తేముందు దాదాపు గొణిగినట్లే అన్నాడు అతి మెల్లగా! ‘‘్థంక్ యు, థాంక్ యు ఫర్ ఏ లలీ నైట్’ అన్నాడు క్రితం రాత్రి గురించి, మాట్లాడుతూ!
పట్టు సడలింది. తల ఎత్తి నా కళ్లలోకి చూచాడు. మృదువుగా కనురెప్పలమీద స్పుశించిన పెదాలు పెదిమల మీద ఆగిపోయాయి. కొద్దినిమిషాలలో రెడీ అయి సూట్‌కేసుతో సహా క్రిందకు దిగాడు.
‘‘అయ్యో నువ్వెందుకురా పెట్టె తీసుకురావడం’’ పనివాడు తెచ్చేవాడుగా వాపోయింది అతని అమ్మ.
‘‘్ఫర్వాలేదులే! అలవాటు కాని, ఈ ఊరు దాటంగానే, నేనే పనివాడిని’’ అన్నాడు నవ్వుతూ అమ్మ వంక చూస్తూ.
మధ్యాహ్నం అందరూ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ ఎయిర్‌పోర్టులో దాదాపు సగంమంది ఇతని కోసం వచ్చినవాళ్ళే! విజయవాడనుండి అమ్మ, నాన్న, అన్నయ్య, నాగపూర్ నుంచి చిన్న అన్నయ్య అంతా వచ్చారు. మామయ్య కుటుంబం, అతని బంధువులు, కుటుంబం అందరితో దాదాపు ఒక పెళ్లి గ్రూప్‌లా ఉంది.
అందరికి రఘుకు సెండాఫ్ ఇవ్వడంలో ఒక సంతృప్తి ఉంది. విచారం ఉంది. అతను చిన్నప్పటినుండి చదువులో చాలా చురుగ్గా అందరిలోకి మొదటివాడుగా ఉండేవాడుట. అటువంటివాడికి ఈ అవకాశం కేవలం రాకేమవుతుంది అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. అతను సాధించినవి ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటే, వాటితో నాకు ఎటువంటి సంబంధమూ లేకపోయినా చాలా గర్వంగా అనిపించింది. అవేవో నేనే సాధించానా అన్నట్లు.
నేను ఒక చివరగా నుంచున్నాను. అందరూ దాదాపు ఓ పాతికమందిపైగానే ఉన్నారు. రఘు అందరిని పలకరిస్తున్నాడు. అందరూ జోక్స్ వేస్తూ, జాగ్రత్తలు తెలుపుతూ, సంతోషాన్ని వెలిబుచ్చుతూ రకరకాలుగా వీడ్కోలు చెప్తున్నారు. రఘు కూడా, ఏ ఒక్కరినీ విడచిపెట్టకుండా, పలకరిస్తున్నాడు.
నేను మాత్రం ప్రేక్షకురాలిగానే ఉండిపోయాను.
అతను కనీసం నా వంక కనె్నత్తి కూడా చూడలేదు. ఒక్కసారి నాకు దగ్గరగా రాలేదు. బహుశ అందరి మద్యలో నాకు వీడ్కోలు చెప్పడం ఇష్టం లేదో, లేక ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరేముందు చెప్పేశాననుకున్నాడో?
వెనుకనుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. బొంబాయి వెళ్లాల్సిన ప్రయాణికులను, ఫలానా చోటికి రమ్మనమని.
అందరూ రఘు వంక ఆత్రుతగా చూశారు. అందరికీ ఒకేసారి గుడ్‌బై చెప్పి, వాళ్ళ నాన్న దగ్గర ఆగిపోయాడు. ఆయన కొడుకు వెన్నుతట్టుతూ ‘నీ ఆరోగ్యం జాగ్రత్త’ అన్నారు.
వాళ్ళమ్మ కళ్ళల్లోంచి మాత్రం ఇక ఆ క్షణంలో నీళ్ళు ఆగలేదు. వాళ్ళమ్మను ఒక్కసారిగా గట్టిగా కావలించుకుని, ఎయిర్‌పోర్టు అని కూడా చూడకుండా వాళ్ళిద్దరి పాదాలకు నమస్కరించాడు.
ఇంతలో మరో అనౌన్స్‌మెంట్ వచ్చింది. వెంటనే వాళ్ళమ్మ చేతులు వదిలేసి, మెల్లిగా నడుస్తూ నా దగ్గరకు వచ్చి ఆగిపోయాడు.
అంతవరకూ చేతిమీద వేలాడుతున్న పూలదండను తీసి నా చేతిమీద వేశాడు. కుడిచేతిలో ఉన్న బ్రీఫ్ కేసును నేలమీద ఉంచాడు. నా వంకే చూస్తూ ఆగిపోయాడు.
తన రెండు చేతులతో నా చేతులు పట్టుకున్నాడు. అచ్చం మొదటి రాత్రిలాగా! అలాగే, మళ్లీ నా చేతులు కూడా తడితడిగా ఉన్నాయి.
అది గమనించి నవ్వాలని ప్రయత్నిస్తూ
‘‘బాగా చదువు’’ అన్నాడు.
తల ఊగించాను.
‘టేక్ కేర్’ అన్నాడు.
మళ్లీ తల ఊగించాను.
అతనికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికళ్ళూ మా ఇద్దరిమీదే ఉన్నాయని నాకు తెలుసు. అతను గ్రహిస్తున్నాడో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. కాని అతను అలా గుడ్‌బై చెప్పడంతో, మనసులో భావాలు దాచడం చాలా కష్టమనిపించింది. కళ్ళల్లో నీళ్ళు నిండుతున్నాయి. అవి జారడానికి ఎక్కువ సమయం పట్టదు.. అవి జారడం నాకు ఇష్టంలేదు. అతను నన్నలా చూడటం నాకు ఇష్టంలేదు.
అతనూ అదే పరిస్థితిలో ఉండి ఉండచ్చు. చటుక్కున అరచేతులు పైకెత్తి గోరింటాకు మీద పెదిమలు ఆనించి వదిలేశాడు. క్షణకాలం నా వంకే చూశాడు. నా చేతిమీద ఉన్న పూల దండకి చుట్టిన చకీ అతని మొహానికి అతుక్కుంది. అప్రయత్నంగా ఆ చంకీని తీసేశాను.
కింద ఉన్న బ్రీఫ్ కేసును అందుకుని గేటువైపు నడిచాడు, మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా!
అందుకే అంత చివరదాకా నాకు గుడ్‌బై చెప్పలేదన్నమాట. నాతో వీడ్కోలు అయ్యాక అతనికి కూడా ఎవరూ తనని చూడటం ఇష్టంలేదు కాబోలు. లేదా నన్ను చూడటం అతనికి ఇష్టంలేదేమో!
నాకు ఎందుకో చాలా సడెన్‌గా చాలా వంటరిగా అనిపించింది. ఎయిర్‌పోర్టులో గొడవ, వీడ్కోలు కోసం వచ్చిన వారి మాటలు ఏవీ నాకు వినిపించడం మానేశాయి. 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-ఇంకాఉంది