రాష్ట్రీయం

బిజెపికి రెండు సీట్లే ఇద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్సీ ఎన్నికలపై బాబుకు టిడిపి నేతల సూచన బిజెపి నేతలతో మాట్లాడదామన్న ఏపి సిఎం
హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ శాసనమండలికి జరగనున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. కరవు, తాగునీటి సమస్య తదితర అంశాలపై ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి సూచించారు. శనివారం టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రమణ, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా సమావేశమై, వివిధ అంశాలపై చర్చించారు. బిజెపితో పొత్తువల్ల కలిగే లాభనష్టాలపైనా వారు చర్చించారు. అయితే ఇది ఢిల్లీ స్థాయిలో ఒప్పందం ఉన్నందున, ఇక్కడ మనం చేయగలిగిందేమి లేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థికి సహకారం అందించిన విధంగానే రాబోయే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సహకారం తీసుకోవాలని వారు భావించారు. అయితే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీయే పోటీ చేయాలని, బిజెపికి రెండు సీట్లకు మించి ఇవ్వరాదని పార్టీ నాయకులు కొందరు సమావేశంలో డిమాండ్ చేశారు. తమ పార్టీయే బలంగా ఉందని, బిజెపికి ఇవ్వడం ద్వారా నష్టపోతామని వారు అన్నట్లు తెలిసింది. వరంగల్‌లో రెండు పార్టీల బలం కలిసినా, రెండో స్థానం రాకపోవడానికి గల కారణాలపై వారు చర్చించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. టిడిపి పోటీ చేసి ఉంటే రెండో స్థానమైనా దక్కేదని ఒక నాయకుడు వ్యాఖ్యానించగా, బిజెపి అభ్యర్థి దేవయ్య ఎన్‌ఆర్‌ఐ కావడం, ఆ పార్టీకి, ప్రజలకు కొత్త వ్యక్తి కావడం వల్ల కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయలేదని వారు భావించారు.