క్రీడాభూమి

యువీకి భారీ ధర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితాలో నిర్వహణ కమిటీ సోమవారం ప్రకటించనుంది. వివిధ ఫ్రాంచైజీలు వేలం కోసం విడుదల చేసిన 714 మంది ఆటగాళ్లకు బేస్ ప్రైస్‌ను నిర్ధారిస్తారు. వీరిలో 12 మంది క్రికెటర్లను ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. వారిలో యువరాజ్ సింగ్‌కు భారీగా రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ఉంటుందని అంటున్నారు. గత ఏడాది యువీకే అత్యధిక ధర పలికిన విషయం తెలిసిందే. అతనితోపాటు ఇంగ్లాండ్ జట్టులో స్థానం కోల్పోయిన కెవిన్ పీటర్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, ఇశాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా, దినేష్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజూ శాంసన్, ధవళ్ కులకర్ణి, కేన్ రిచర్డ్‌సన్, 40 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మైక్ హస్సీ కూడా రెండు కోట్ల రూపాయలు పలకవచ్చని తెలుస్తోంది. అదే విధంగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, భారత ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌కు చెందిన జొస్ బట్లర్ 1.5 కోట్ల రూపాయల జాబితాలో స్థానం సంపాదించుకోనున్నారు. ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌథీ కోటి రూపాయల బేస్ ప్రైస్‌ను దక్కించుకుంటారు.