అంతర్జాతీయం

ఉమ్మడిగా కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 25: ఉగ్రవాద నిరోధన ఉత్తుత్తి మాటేనన్న తన ధోరణిని పాకిస్తాన్ మరోసారి రుజువు చేసుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడి కుట్రదారుల్ని వదిలేది లేదని మొదట్లోచెప్పిన పాక్ ఇప్పుడు మాటమార్చింది. ఈ దాడికి కుట్రదారులుగా భావిస్తున్న జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్, ఇతర అనుమానితుల్ని ఉమ్మడిగా ప్రశ్నించాలన్న భారత ప్రతిపాదనను తిరస్కరించింది. మసూద్, అతడి సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రెహ్మాన్‌ను ఉమ్మడిగా విచారించేందుకు తమ దర్యాప్తు అధికారుల్ని పంపాలని భారత్ భావించిందని కానీ ఆ ప్రతిపాదనను పాకిస్తాన్ ‘సున్నితం’గా తిరస్కరించిందని సీనియర్ అధికారి వెల్లడించారు. మసూద్, హఫీజ్ సరుూద్‌లను తమకు అప్పగించాలని భారత్ ఇప్పటికే ఎన్నో సార్లు కోరిందని ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామని తెలిపారు. అయితే వీరిని ఉమ్మడిగా విచారించేందుకైనా అనుమతించాలని తాజాగా కోరిందని, ‘అదీ సాధ్యం కాదు’అని తాము తేల్చిచెప్పామని ఆ అధికారి వెల్లడించారు. ఇప్పటికే అరెస్టయిన వారిని విచారిస్తున్నామని, ఆ సమాచారాన్నీ భారత్‌కు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని మరో అధికారి తెలిపారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసిన మిలిటెంట్లు భారత నిర్బంధంలో ఉన్న మసూద్‌ను విడిపించుకున్న విషయం తెలిసిందే. పఠాన్‌కోట్ దాడి విషయంలో భారత్ అందించిన సాక్ష్యాల ఆధారంగా ఇప్పుడు మసూద్‌ను పాక్ అరెస్టు చేసిందని, ఇప్పటికే అతడ్ని ప్రశ్నించిందని అధికారులు వెల్లడించారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో భారత్ పాక్‌ల మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మసూద్‌ను ఉమ్మడిగా విచారించాలన్న భారత్ ప్రతిపాదనను పాక్ తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పఠాన్‌కోట్ దాడికి కుట్ర పన్నిన వారిని వదిలేది లేదని చెబుతున్న పాకిస్తాన్..దోషులుగా తేలిన ఎవర్నీ వదిలి పెట్టేది లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.