జాతీయ వార్తలు

ఉగ్రవాదం ఇక సాగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ఉగ్రవాద ధోరణిని విడనాడాలని పాకిస్తాన్‌కు భారత్, ఫ్రాన్స్ ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశాయి. పఠాన్‌కోట్‌పై దాడికి కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని గట్టిగా కోరాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ మధ్య సోమవారం జరిగిన విస్తృత భేటీలో పాక్ ఉగ్రవాదం సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పారిస్ నుంచి పఠాన్‌కోట్ వరకు ఉగ్రవాద వికృత రూపాన్ని తాము చూశామని, ఈ మహమ్మారిని అణచివేసేందుకు కలసికట్టుగా కృషి చేయాలని ఇద్దరు నేతలు సంకల్పించారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్‌పై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో కలసి ఉమ్మడిగా ముందుకు సాగుతామని, ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడమే తన పర్యటన ప్రధాన ఉద్ధేశ్యమని హోలాన్ పేర్కొన్నారు. భారత్‌లో మూడు రోజుల పర్యటన జరుపుతున్న హోలాన్ మంగళవారం రాష్టప్రతి భవన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వాతావరణ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన పారిస్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎంతో ముఖ్యమైన పాత్ర’ పోషించారని హోలాన్ ప్రశంసించారు. ఆర్థిక రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాతావరణ సదస్సు (సిఓపి 21)లో తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయించేందుకు భారత్, ఫ్రాన్స్ కలసికట్టుగా ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో మంగళవారం గణతంత్రదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న హోలాన్ మంగళవారం రాష్టప్రతి భవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సమక్షంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోలాన్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దాదాపు అన్ని రకాల సమస్యలు భారత్, ఫ్రాన్స్ వంటి దేశాలను చుట్టుముడుతున్నాయని, తీవ్రవాదంపై పోరాటంలో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలన్నదే ప్రస్తుతం తన పర్యటన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘మనల్ని మనం రక్షించుకుని ప్రపంచానికి ప్రాతినిథ్యం వహించాలన్న ఉమ్మడి విలువలను మరోసారి ప్రస్తావిస్తున్నా. వాతావరణ సమస్యల పరిష్కారం కోసం సిఓపి 21లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయించేందుకు కలసికట్టుగా ముందుకు సాగుతున్న మనం వ్యవసాయం మొదలుకొని ఖగోళ రంగం వరకు అన్ని రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. ఈ రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకుని ఇరు దేశాలు తమ ప్రయోజనాలను పెంపొదించుకోవాల్సిన అవసరం ఉంది’ అని హోలాన్ అన్నారు. అంతకుముందు ఆయన న్యూఢిల్లీలో రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నరమేధం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ గురించి విలేఖర్లు ఈ సందర్భంగా హోలాన్‌ను ప్రశ్నించగా, ఫ్రాన్స్ ఎప్పుడూ తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉంటుందని, ఉగ్రవాదం నుంచి ఎటువంటి ముప్పు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.