తెలంగాణ

యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి నేరుగా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కమ్మదనం గ్రామ శివారులో గల మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. అంతేకాకుండా జడ్చర్లలో కూడా పనుల పురోగతిపై మహబూబ్‌నగర్ కలెక్టర్ టికె శ్రీదేవితో పాటు వాటర్ గ్రిడ్ అధికారి కృపాకర్‌రెడ్డితో ఆరా తీశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మహబూబ్‌నగర్ మండలం మన్యంకొండ గుట్టపై నిర్మించబోయే వాటర్‌గ్రిడ్ పంపుహౌస్ స్థలాలను రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని కూడా పరిశీలించారు. అక్కడి నుండి జూరాల ప్రాజెక్టుకు చేరుకుని డ్యాంను పరిశీలించి జూరాల బ్యాక్ వాటర్ ద్వారా అందించే వాటర్‌గ్రిడ్ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. జూరాల సమీపంలోని కారుకొండయ్య గుట్టలో జరుగుతున్న పనులను పరిశీలించి పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులను ఆదేశించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలంలో గల రామన్‌పాడు రిజర్వాయర్ ప్రాంతంలో జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులను పరిశీలించి ఒవర్‌హెడ్ ట్యాంకుల కెపాసిటీ నిర్మాణానికి సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీషన్ భగీరథ పనులను వేగవంతంగా యుద్దప్రతిపపాదికన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబందిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు వేగవంతం చేయాలన్నారు.