జాతీయ వార్తలు

అరుణాచల్ గవర్నర్‌గా షణ్ముగనాథన్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, సెప్టెంబర్ 14: అరుణాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జి గవర్నర్‌గా వి షణ్ముగనాథన్ బుధవారం పద వీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ యన మేఘాలయ గవర్నర్‌గా ఉన్నారు. మేఘాలయతోపాటు అరుణాచల్ ప్రదేశ్ అదనపు బాధ్యతలు చేపట్టాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు. ఈ మేరకు రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12న జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవాను గవర్నర్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న కొద్ది వారాల తరువాతే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజిత్ సింగ్ షణ్ముగనాథన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి పేమా ఖండూ, ఆయన మంత్రివర్గ సహచరులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళవారమే ఇటానగర్ చేరుకున్న షణ్ముగనాథన్ ఇటాఫోర్ట్, బుద్ధిస్ట్ గొంప, జవహర్‌లాల్ నెహ్రూ స్టేట్ మ్యూజియంలను సందర్శించారు. బౌద్ధ సన్యాసులతో ఆయన భేటీ అయ్యారు.

తగాదాలతోనే
మోదీ పబ్బం!
ఇతరుల మనసూ తెలుసుకోండి
ప్రధానిపై రాహుల్ విసుర్లు
మీర్జాపూర్ (యూపీ), సెప్టెంబర్ 14:ప్రజల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్‌లో అశాంతి రగులుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇలాంటి ధోరణి వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుందని బుధవారం ఇక్కడ జరిగిన రోడ్‌షోలో రాహుల్ అన్నారు. ‘హర్యానాలో జాట్‌లు నాన్‌జాట్‌ల మధ్య గొడవ రగిలించారని, కాశ్మీర్‌లో ప్రజలే పరస్పరం కొట్టుకునే పరిస్థితి తలెత్తిందని రాహుల్ అన్నారు. ఉత్తర ప్రదేశ్, అసోంలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ రైతు యాత్రను మొదలు పెట్టిన రాహుల్ మోదీ సర్కార్ విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తే ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాల్లో పదిహేను లక్షల చేరుతాయని చెప్పిన మోదీ ఆ హామీని విస్మరించారని రాహుల్ ఆరోపించారు. మోదీ తన మనసులో మాటను చెబుతారే తప్ప ఇతరుల మనసులో ఏముందో తెలుసుకోరంటూ ఆయన మన్‌కి బాత్ కార్యక్రమంపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు.

మీర్జాపూర్‌లో బుధవారం జరిగిన రైతు ర్యాలీ సందర్భంగా సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్‌తో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ