జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై ఎన్‌ఐఏ ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ హైదరబాద్, జనవరి 23: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)తో పాటు కేంద్ర భద్రతా సంస్థలు శనివారం వరుసగా రెండో రోజూ ఉక్కుపాదం మోపాయి. గణతంత్ర దినోత్సవానికి ముందు దాడులకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో వివిధ రాష్ట్రాల్లో 14మందిని అరెస్టు చేసి స్థానిక కోర్టుల్లో హాజరుపరిచాయి. ఎన్‌ఐఎ, జాతీయ భద్రతా సంస్థల అధికారులతో కూడిన బృందం వీరందరినీ ట్రాన్సిట్ రిమాండ్‌పై న్యూఢిల్లీకి తరలించి లోతుగా ప్రశ్నించనున్నట్టు కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి శనివారం ఇక్కడ వెల్లడించారు. శనివారం అరెస్టయిన వారిలో ఐసిస్ భావజాలంతో ఏర్పాటైన ఉగ్రవాద గ్రూపు ‘జనూద్- ఉల్- ఖలీఫా- ఇ- హింద్’ (ఆర్మీ ఆఫ్ కాలిప్ ఇన్ ఇండియా) ఉప నాయకుడిగా చెప్పుకుంటున్న రిజ్వాన్ అలీ కూడా ఉన్నాడు. ఎన్‌ఐఎ, జాతీయ భద్రతా సంస్థలు శనివారం తెల్లవారుజాము వరకు ఆరు రాష్ట్రాల్లోని వేర్వేరు నగరాల్లో దాడులను కొనసాగించి ముంబయిలో హస్సేన్ ఖాన్ అనే వ్యక్తిని, ఔరంగాబాద్‌లో ఇమ్రాన్ పఠాన్ అనే వ్యక్తిని లక్నోలో అలీమ్ అహ్మద్ అనే వ్యిక్తిని అరెస్టు చేశాయి.
అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌కు చెందిన రిజ్వాన్‌ను హైదరాబాద్‌లో అరెస్టుచేసి ఇంటరాగేషన్ కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. సిరియాలో నరమేథం సృష్టిస్తున్న ఐసిస్ భారత్‌లో యువతను ఉగ్రవాద రొంపిలోకి దింపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ సంస్థపై ఎన్‌ఐఎ గత ఏడాది కేసు నమోదు చేసింది.
కర్నాటకలో 300 సమస్యాత్మక ప్రాంతాలు
ఇదిలావుంటే, కర్నాటకలో 300 పైగా ప్రాంతాలను ‘సమస్యాత్మకమైనవి’గా గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర శనివారం విలేఖర్లకు వెల్లడించారు. ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తులు శుక్రవారం కర్నాటకలో పట్టుబడిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అరెస్టయిన నిందితులను మంగళూరుకు చెందిన నజ్ముల్ హుడా (25), తుముకూరుకు చెందిన సరుూద్ ముజాహిద్ (33), బెంగళూరుకు చెందిన ఆసిఫ్ అలీ అలియాస్ హఫీజ్ సాబ్ (23), మహమ్మద్ అబ్దుల్ అహద్ అలియాస్ బడే అమీర్ అలియాస్ సులేమాన్ (46)గా గుర్తించారు. వీరందరినీ ట్రాన్సిట్ వారెంట్‌పై ఈ నెల 27వ తేదీన ఢిల్లీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
సానుభూతిపరులు ఢిల్లీకి తరలింపు
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఐసిస్ సానుభతూతిపరులను శనివారం ఎన్‌ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. శుక్రవారం టోలిచౌక్‌కు చెందిన నఫీజ్‌ఖాన్, అబూ అమాష్, షరీఫ్ మోహియుద్దీన్, ఉబేదుల్లాను అరెస్టు చేసిన విషయం విధితమే. శనివారం నాంపల్లి కోర్టుకు హాజరుపర్చి పిటి వారంట్‌పై ఢిల్లీకి తరలించారు. నగరంలో హై అలెర్ట్ తెలంగాణ పోలీసులు రాష్టవ్య్రాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఐసిస్ దాడులపై ఐబి హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన నగరాలతోపాటు జిల్లా కేంద్రాల్లో పోలీసులు భద్రత పెంచారు. శంషాబాద్ విమానాశ్రయం సహా ముఖ్య ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు సిపి ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధించినట్టు సిపి పేర్కొన్నారు.