అంతర్జాతీయం

ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 24: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి భారత దేశం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముప్పునకు మరో ఉదాహరణ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. పాకిస్తాన్ తన భూభాగంనుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లన్నింటినీ సమూలంగా నిర్మూలించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్తాన్ గడ్డపై స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై ఆ దేశం మరింత పటిష్ఠమైన చర్యలను తీసుకుని తీరాలని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నవారి పట్ల, ఉగ్రవాదుల పట్ల ఏమాత్రం జాలీ, దయ ఉండకూడదని ఆయన అన్నారు. ‘తనగడ్డపై ఉన్న ఉగ్రవాద ముఠాలను ఆనవాళ్లు లేకుండా పూర్తిగా అంతమొందించడానికి పాకిస్తాన్‌కు ఒక అవకాశం లభించింది’ అని ఒబామా పిటిఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా-్భరత్ సంబంధాలు, ఉగ్రవాదం, పర్యావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన ప్రపంచ సదస్సు లాంటి అనేక విషయాలపై అడిగిన ప్రశ్నలకు ఆ ఇంటర్వ్యూలో ఒబామా సమాధానాలు చెప్పారు.
పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి తర్వాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు దగ్గరైన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ఒబామా చెప్పారు. దక్షిణాసియా ప్రాంతంలో హింసాత్మక తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని ఎలా అదుపు చేయాలనే దానిపై ఇరువురు నేతలు చర్చలను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. కాగా, భారత్-అమెరికా సంబంధాలు ఈ శతాబ్దంలోనే ఎప్పటికీ నిలిచిపోయే భాగస్వామ్యంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ఒబామా వ్యక్తం చేస్తూ, ఒక బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలని తనలానే మోదీ కూడా భావిస్తున్నారని, తామిద్దరమూ బలమైన బంధాన్ని,స్నేహ బంధాన్ని పెంపొందించుకున్నామని తెలిపారు.
పఠాన్‌కోట్ దాడిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌లాగానే తాము కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎక్కువ ప్రాణనష్టం జరక్కుండా చూడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన భారతీయులకు సెల్యూట్ చేస్తున్నామని, మృతులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఒబామా చెప్పారు. పాకిస్తాన్‌లో అభద్రత తమ దేశానికి, మొత్తం ఈ ప్రాంతానికే ముప్పనే విషయాన్ని నవాజ్ షరీఫ్ గ్రహించారని ఒబామా అభిప్రాయ పడ్డారు. అందుకే 2014లో పెషావర్‌లోని స్కూలుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులందరినీ తుడిచిపెట్టడానికి ఆయన ప్రతిన బూనారని, ఇది సరైన విధానమని అభిప్రాయపడ్డారు. కాగా, అధ్యక్షుడిగా తన చివరి సంవత్సరంలో భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, తమ విదేశాంగ విధానం ప్రాధామ్యాల్లో అది కూడా ఒకటిగా ఉంటుందని ఒబామా స్పష్టం చేశారు.