ఉద్యోగావకాశాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్-1800 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. మరియు ఐబిపిఎస్ నిర్వహించిన కామన్ రిటన్ ఎగ్జామ్‌లో స్కోర్ సాధించి ఉండాలి. వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జనవరి 31. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)-58, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)-135, కానిస్టేబుల్ (డ్రైవర్)-425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: హెడ్ కానిస్టేబుల్‌కు పదవ తరగతితోపాటు ఐటిఐతోపాటు మూడేళ్ల అనుభవం లేదా డిప్లమో ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాలి. కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)కు ఐటిఐ ఇన్ మోటార్ మెకానిక్/ఆటో మొబైల్ ఇంజనీరింగ్ ఉండాలి. కానిస్టేబుల్ (డ్రైవర్)కు పదవ తరగతితోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు 25 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 24. ఇతర వివరాలకు హెచ్‌టిటిపి://ఐటిబిపి డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
బివిఎఫ్‌సిఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీలు-39 పోస్టుల భఱ్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కెమికల్-15, మెకానికల్-5, ఎలక్ట్రికల్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, పర్సనల్-2, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-2, మార్కెటింగ్-3, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-2 పోస్టులున్నాయి. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బిఇ/బిటెక్/మాస్టర్స్ డిగ్రీ/ఎంబిఎ ఉండాలి. వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 16. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ బివిఎఫ్‌సిఎల్ డాట్ కామ్ వెబ్‌సైట్ చూడండి.
ఎస్‌ఎస్‌సి జూనియర్ ఇంజనీర్లు
స్ట్ఫా సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్స్-742 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సిపిడబ్ల్యుడి-378, సిడబ్ల్యుసి-105, ఎంఈఎస్-259 పోస్టులున్నాయి. అర్హతలు: సంబంధిత విభాగాలలో డిప్లమో ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి. వయసు 27 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 10. రాత పరీక్ష 2012 ఏప్రిల్ 8న జరుగుతుంది. ఇతర వివరలకు హెచ్‌టిటిపి:// ఎస్‌ఎస్‌సి డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఎపీ ట్రాన్స్‌కో
ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇంధ్రప్రదేశ్ లిమిటెట్ జూనియర్ లైన్‌మెన్-1648 (విశాఖపట్నం-348, విజయవాడ-279, కడప-319, హైదరాబాద్ మెట్రో-164, హైదరాబాద్ రూరల్-212, వరంగల్-252), సబ్ ఇంజనీర్స్-339 (విశాఖపట్నం-67, విజయవాడ-61, కడప-78, హైదరాబాద్ మెట్రో-49, హైదరాబాద్ రూరల్-48, వరంగల్-36) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: లైన్‌మెన్‌కు పదవ తరగతితోపాటు ఐటిఐ ఎలక్ట్రికల్/ వైర్‌మెన్/ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెనె్సస్ అండ్ రీవైండింగ్‌లో ఒకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. సబ్ ఇంజనీర్స్‌కు డిగ్రీ/డిప్లమో ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. వయసు లైన్‌మెన్‌కు 35 సంవత్సరాలు, సబ్ ఇంజనీర్లకు 36 సంవత్సరాలుండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తే దీ 2012 ఫిబ్రవరి 18. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎపి ట్రాన్స్‌కో డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఆఫీసర్స్-4, ప్రాజెక్టు సీనియర్ ఎగ్జిక్యూటివ్-20, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్-8, ప్రాజెక్టు ఎగ్జిక్యుటివ్ (హిందీ)-1, ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్-12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ/ఎంబిఎ/సిఎ/ఐసిడబ్ల్యుఎ/డిగ్రీ/ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 08. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్‌ఐఓటి డాట్ ఆర్‌ఈఎస్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్స్
ఇండియన్ కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (పురుషులు), అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ (పైలట్, నేవిగేటర్ లేదా అబ్జర్వర్)), అసిస్టెంట్ కమాండెంట్ (కమర్షియల్ పైలట్ లైసెన్స్), అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్ బ్రాంచ్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు 60 శాతం మార్కులతో డిగ్రీ/బిఎస్‌సి డిగ్రీ/65 శాతం మార్కులతో బిఈ/బిటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జనవరి 30. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ జాయిన్ కోస్ట్‌గార్డ్ డాట్ ఓఆర్‌జి వెబ్‌సైట్ చూడండి.
Add new comment