క్రీడాభూమి

అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: సుందర్ వాషింగ్టన్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరచడంతో, అండర్-19 ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ని నాలుగు వికెట్ల తేడాతో గెల్చుకున్న భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ మొదటి వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి భారత్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. రిషబ్ 51 పరుగులతో రాణించగా, సుందర్ 50 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు చేసింది. మెహదీ హసన్ మీర్జా 87 పరుగులు చేయగా, సుందర్ 25 పరుగులకే రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 223 పరుగులు సాధించింది. రిషబ్, సుందర్ అర్ధ శతకాలు భారత్‌కు సునాయాస విజయాన్ని అందించాయి.
శ్రీకాంత్ నిష్క్రమణ
మకావూ, నవంబర్ 24: భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ ఆరంభమైన మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న అతను ఇండోనేషియాకు చెందిన క్రిస్టీ జొనతాన్‌ను ఢీకొని 16-21, 21-23 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ తమతమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్ చేరారు. జయరామ్ 21-6, 25-23 ఆధిక్యంతో తామ్ చున్ హెయ్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. ప్రణయ్ 21-15, 16-21, 21-18 స్కోరుతో సుకంతా ఎవర్ట్ (ఇండోనేషియా)ను ఓడించాడు. సాయి ప్రణీత్ 21-18, 23-21 ఆధిక్యంతో ఇండోనేషియాకే చెందిన ఫిర్కీ ఇషాంది హద్మాడీపై విజయాన్ని నమోదు చేశాడు.