క్రీడాభూమి

భారత్ చేతిలో అఫ్గాన్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్-19 క్రికెట్
కోల్‌కతా, నవంబర్ 21: అండర్-19 ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 33 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ 87, మణిపాల్ లొంరోర్ 43 పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ 47 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. రషీద్ అర్మాన్ 43, మహమ్మద్ సర్దార్ వలీ 33 పరుగు చేసి అవుట్‌కాగా, ఖలీల్ అహ్మద్ 41 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు.

================
ఆసియా జూనియర్ హాకీ
ఫైనల్‌కు భారత్
కౌంటన్ (మలేసియా), నవంబర్ 21: జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-1 తేడాతో విజయభేరి మోగించిన భారత జట్టు ఆసియా కప్ జూనియర్ హాకీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా, మన్దీప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ జూనియర్, విక్రమ్‌జిత్ సింగ్, వరుణ్ కుమార్ తలా ఒక్కో గోల్ చేశారు. జపాన్‌కు యసుద షోతా ద్వారా గోల్ లభించింది.