ఉత్తరాయణం

అర్థంలేని అభద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీర్ ఖాన్‌కు భారతదేశంలో భ్రదత లేదట! ఇంతకు ముందు షారూక్ ఖాన్‌కు, సల్మాన్ ఖాన్‌కు భ్రదతలేదని పించింది. కృష్ణజింకను చంపిన కేసులో శిక్షపడలేదు. మద్యంమత్తులో కారు నడిపి రహదారి పక్కన పడుకున్న వారిని చంపిన కేసులో కూడా శిక్ష పడిన గంటలోగానే స్టే లభించింది. నిజమే ఇటువంటి దేశంలో మంచివారికి భద్రత లేదు. ఆ విషయానే్న సల్మాన్ ఖాన్ చెబుతు న్నాడు. మనం ఆ మాటను తప్పుగా అర్థం చేసుకుంటు న్నాం! హిందూ స్ర్తీలను వివాహమాడి సజావుగా కాపురా లు చేసుకుంటున్న ఖాన్‌గార్లిద్దరికీ ఆకస్మికంగా భద్రత లేకుండా పోయంది. మతకలహాల కారణంగా హైదరాబా ద్, బెంగళూరు, గుల్బర్గా, మురాదాబాదు, ముంబయ.. ఇలా చాలా ప్రదేశాల్లో నెలల తరబడి కర్ఫ్యూలు, కనబ డితే కాల్చివేత ఉత్తర్వులు ఉన్నప్పుడు వీరికి దేశంలో వీరికి అసహనం కనిపించలేదు. అభద్రతాభా వం కలుగలేదు. అసలు మత కలహాలు జరగని కాలంలో ఈ దేశంలో బతకడమెలాగ? అని అసహనంతో బాధ పడుతున్న ఖాన్ త్రయాన్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవాలసిందేనా?
- వరిగొండ కాంతారావు, హనుమకొండ
ఆలయాలను పునరుద్ధరించాలి
విజయవాడ-హైదరాబాద్ 65వ నెంబరు జాతీయ రహదారి విస్తరణ సమయంలో అడ్డు ఉన్నాయని తొలగించిన ఆలయాలు ఇంతవరకు పునర్ నిర్మాణానికి నోచలేదు. విశిష్ట చరిత్రను స్వంతం చేసుకున్న ఆలయాలను కోర్టు ఉత్తర్వుల సాయంతో తొలగించి ఆ తర్వాత వాటి పునర్ నిర్మాణానికి తగినన్ని నిధులను కేటాయంచక ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ఇనుపాములలో పబ్బలి పార్వతి సోమేశ్వరాలయం, చీకటిగూడెంలో శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం, కొయ్యలగూడెంలో ప్రసన్నాంజనేయస్వామి, ఆందోళీ మైసమ్మ, చిట్యాలలో రామలింగేశ్వరస్వామి, రాయని గూడెంలో శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాలు విస్తరణలో భాగంగా తొలగించబడ్డాయ. దేవాదాయశాఖ పరిధిలోని మరి ఎనిమిది ఆలయాలు, వీటి భూములు కూడా రోడ్డు విస్తరణలో పోయాయ. కేతేపల్లి వద్ద మేరీమాత ఆలయం కేవలం మూడు నెలలోపే పునర్ నిర్మించబడటం విశేషం. ఇందులో ఇనుపాముల శివాల యంలో ఎంతో విలువైన కాకతీయుల కాలంనాటి శిల్ప సంపద, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నప్ప టికీ పట్టించుకున్న నాథుడు లేడు. ఆలయాల కూల్చివేత సమయంలో అధికారులు చూపిన అత్యుత్సాహం ఇప్పుడు అసలు కానరావడం లేదు. అరకొర నిధులతో ఆలయాల నిర్మాణం జరగదు. తక్షణం ప్రభుత్వం స్పందించి తొలగించిన ఆలయాలను పునరుద్ధరించాలి.
-సి.హెచ్. సాయఋత్విక్, నల్గొండ
ఎందుకీ అనవసర పొగడ్తలు?
ఇటీవల విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి జగన్‌ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధార్మికతను తెగ పొగడుతున్నారు. వైఎస్ హయాంలోనే కదా ఏడుకొండల్ని రెండు కొండలు చేయాలని చూసింది. ఇక జగన్ మహాశేయులు ఏకంగా చెప్పులు ధరించే శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు. వైఎస్ హయాంలో ఎన్నో మతమార్పిడులు జరిగాయ. అటువంటప్పుడు ఎందుకీ పొగడ్తలు?
- పెంబర్తి సాయశ్రీ, అమీర్ పేట, హైదరాబాద్
అసహనం పేరిట అప్రతిష్ఠ పాలు చేయొద్దు
అసహనం పేరిట ఎవరు పడితే వారు ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న వారిపై రాజద్రోహ నేరం మోపి శిక్షలు విధించాలి. అసహనం పెరిగిపోతున్నదన్న అమీర్ ఖాన్ దేశానికి క్షమాపణ చెప్పాలి. అటువంటి అసహనమే భారత్‌లో ఉంటే ఖాన్ త్రయం సూపర్ స్టార్స్ అయ్యేవారా? శాంతి, సహనం, సహజీవనానికి పెట్టింది పేరు భారత్. విపత్తు సమయాల్లో కుల మతాలకతీతంగా కలిసికట్టుగా పనిచేసిన సంద ర్భాలున్నాయ. సమస్య ఉంటే మనమంతా భారతీయుల మన్న దృక్పథంతో పోరాడాలే తప్ప, దేశం విడిచి పారిపోతామన్న వ్యాఖ్యలు చేయడం తగదు. ఏదో ఒక రాష్ట్రంలో ఒక సంఘటన జరిగినంత మాత్రాన దాన్ని దేశం మొత్తానికి ఆపాదించడం తగదు. భారత్‌లో ఎందరో ముస్లింలు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. సెలబ్రిటీలు ఉన్నారు. అందువల్ల ఆచితూచి మాట్లాడాలి. కొన్ని పత్రికలు అదే పనిగా గోరంతలు కొండంతలు చేసే పనిలోనే ఉంటున్నాయ. ఈ దేశం అమీర్ ఖాన్ వంటివారు ఎంతో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశమి చ్చింది. అంతగా దేశం విడిచిపోవాలనుకుంటే స్వచ్ఛందం గా వెళ్లిపోవచ్చు. అందుకు ఇంత రాద్ధాంతం అవసరమా?
- అయనం రఘరామారావు, ఖమ్మం
అవినీతికి మన్మోహన్‌దే బాధ్యత
రైలు దుర్ఘతనకు బాధ్యత వహించి అలనాటి రైల్వేమంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీ రాజీనామా చేశారు. సిబ్బం ది తప్పిదాలకు యజమాని కూడా బాధ్యుడే అంటూ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి అమెరికాలో వున్న యూనియన్ కార్బైడ్ యజమాని ఆండర్సన్ మీద కూడా కేసు పెట్టారు. నేను అమెరికాలో ఉన్నా. నాకేం తెలియదన్నా సుప్రీంకోర్టు ఆమోదించలేదు. సంస్థ వైఫల్యాలకు సంస్థ ఉన్నత అధికారిని కూడా శిక్షిస్తున్నారు. కాని మన్మోహన్‌సింగ్ నాకేమీ తెలియదు. సెక్రటరీ సలహా ప్రకారం సంతకాలు పెట్టేశాను అంటే సిబిఐ ఆమోదించడం వింతగానే ఉంది. కోర్టు కూడా ఆమోదిస్తే శవపేటికలోని ఆండర్సన్ ఆత్మ అన్యాయం అని ఘోషిస్తుందేమో చూడాలి!!
- పవన్‌పుత్ర, రామారావుపేట