ఉన్నమాట

జెఎన్‌యు డ్రామాయణంలో వీడియోల పిడకల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-- ఉన్నమాట --
షెర్లాక్ హోమ్స్‌కి ఈ కథ చెబితే గుడ్లు తేలేస్తాడు.
తలకిందులుగా తపస్సు చేసినా ఇంత డిటెక్టివ్ వర్కు తనవల్ల కాదని ఒప్పేసుకుంటాడు.
ఔనుమరి! ఢిల్లీ జె.ఎన్.యు. మిస్టరీని బ్రహ్మాండంగా ఛేదించటంలో మన లెఫ్ట్, లిబరల్, సెక్యులర్, రాజకీయ, మీడియా మేధావిగణం చూపించిన అద్భుత సృజనాత్మక ప్రతిభ ముందు ప్రపంచంలోని ఎంత గొప్ప పత్తేదారయినా బలాదూరే.
క్రైం థ్రిల్లర్ కథలూ, సినిమాలలో నేరానికి సంబంధించి అనుమానం మొదట ఎవరెవరి మీదికో పోతుంది. నిజానికి వారు ఏ పాపం ఎరగరనీ, వారిని ఇరికించ చూసిన వారే అసలు విలన్లనీ క్లయిమాక్స్ సీనులో బయటపడుతుంది.
ఇప్పుడూ అంతే!
తెలివిగలవాళ్ల తయారీ కేంద్రం, ఆదర్శాలకూ అభ్యుదయాలకు కేరాఫ్ అడ్రసుగా దేశానికి గర్వకారణమైన జవాహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.)లో అఫ్జల్‌గురు ఉరితీతను నిరసిస్తూ పెద్ద సభ ఏదో జరిగిందనీ, భారతదేశ నాశనాన్ని కోరుతూ పాకిస్తాన్‌కి జైకొడుతూ అందులో దేశద్రోహకర నినాదాలు చాలా చేశారనీ పెద్ద లొల్లి అయింది. విద్యార్థి నేతల మీద కేసులు, అరెస్టులు, దాడులు, రిమాండులు, పార్లమెంటు లోపలా వెలుపలా హిందూ ఫాసిస్టుల గగ్గోలు, ఎడతెగని యాగీలు చూసిచూసి నిజంగానే ఘోర నేరమేదో జరిగిందనే అమాయక ప్రజలు భ్రమపడ్డారు.
మన అదృష్టం! ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టగల మనవారి విప్లవ మేధకు కాశ్మీరీ ఆజాదీల తెలివి తోడైంది. వాటికి మీడియా డిటెక్టివ్‌ల అండ అమిరింది. రాహుకేతువుల అంశావతారాలైన రాహుల్ బాబా, కేజ్రీవాలాల శక్తి, యుక్తి అమోఘంగా పనిచేశాయి. వీటిన్నిటి పుణ్యమా అని మోదీ మాయ పటాపంచలైంది. నిప్పులాంటి అసలు నిజం ఎంచక్కా నిగ్గు తేలింది. ఎట్టకేలకు మన మట్టిబుర్రలకు అర్థమైంది ఏమిటంటే -
ఫిబ్రవరి 9న జె.ఎన్.యు.లో జరిగింది దేశభక్తుల కోసం దేశ భక్తుల ద్వారా దేశభక్తులు నిర్వహించిన దేశభక్తి కార్యక్రమం. అఫ్జల్‌గురు అనే భారత పౌరుడిని మూడేళ్లకింద ఉరి తీయడంపట్ల రాజ్యాంగబద్ధంగా అసమ్మతి తెలిపి, కాశ్మీర్ సోదరుల స్వాతంత్య్ర కాంక్షపట్ల చట్టానికి లోబడి సంఘీభావం ప్రకటించి, భారత రాజ్యానికి భక్తిపూర్వక జోహార్లు అర్పించాలన్నదే తప్ప నిర్వాహకులకు మరో చెడు తలంపు లేదు. జన్మహక్కు అయిన భావప్రకటన స్వేచ్ఛను వినియోగించడం ద్వారా దేశాన్ని తరింపజేయాలని ఆ సత్పురుషులు అనుకుంటే మోదీ దురాత్ముడి సర్కారీ గూఢచారులు, ఎబివిపి ఏజంట్లు, ఆరెస్సెస్ వాలాలు అదృశ్య రూపంలో అక్కడ వాలి ‘్భరత్‌కీ బర్‌బాదీ...’, ‘టుక్ డే’, ‘పాకిస్తాన్ జిందాబాద్’ లాంటి తప్పుడు నినాదాలు చేశారు. హిందూ మనువాద బ్రాహ్మణీకులు పనిగట్టుకుని పుట్టించిన అబద్ధాలవల్ల, పార్లమెంటులో మంత్రి ఇరానీ శివాల మూలంగా అనుమానాల కారుమబ్బులు కమ్మినా, ‘ఆప్’ సర్కారు అద్భుత చొరవవల్ల అవి దూదిపింజల్లా తేలిపోయాయి. ఆ సర్కారు వారు తమను పరీక్షించనున్న ఏడు వీడియోల్లో రెండు అతుకుల మడత బనాయింపులని ‘ట్రూత్ లాబ్స్’ అనే ప్రైవేటు ప్రయోగశాల నిర్ధారించడంతో బండారం బయటపడింది. జెఎన్‌యు దుర్నిరీక్ష్య ప్రతిష్ఠను చూసి ఓర్వలేకే, ఆ వర్సిటీ సహా మొత్తం ఉన్నత విద్యారంగాన్ని తమ కబంధ హస్తాల్లో ఇరికించుకునేందుకే... లెఫ్ట్, లిబరల్, సెక్యులర్ మహామేధావుల ప్రఖ్యాతిని పాడుచేసేందుకే హిందూ పాపులు ఈ మహామాయకు పాల్పడినట్టు తేలిపోయింది. తప్పుడు కేసులు పెట్టి, కోర్టులో కొట్టించి హిందూ మతోన్మాద మోదీ సర్కారు ఎంతగా సతాయించినా, కుట్రలన్నిటినీ ఛేదించి విద్యార్థి వీరుడు కన్నయ్య కుమార్ జైలు తలుపులు తోసుకుని హీరోచితంగా కాంపసుకు తిరిగొచ్చి వీరపూజలందుకోవటంతో న్యాయం గెలిచింది. దౌర్జన్యం తోకముడిచింది. ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు. హిందూ నాజీల కుట్ర కూడా ఒక విధంగా మంచిదే అయింది. వారి పుణ్యం వల్లే దేశ రాజకీయ శూన్యాకాశంలో కన్నయ్య కుమార్ అనే కొత్త తార ఉదయించింది. సిసలైన ఆజాదీ తెచ్చి, దేశాన్ని ఉద్ధరించడానికి భగత్‌సింగ్, చేగువెరాల కంటే నాలుగాకులు ఎక్కువ చదివిన విప్లవ కుమారుడు ఉద్భవించాడు. దేశంలో దేవిడీమన్నా అయిన కామ్రేడ్లకు రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో అక్కరకు రావటానికి కొత్తగా ఒక రక్షకుడు దొరికాడు.
హిందూ వ్యతిరేక ‘ది హిందూ’ లాంటి ఎర్రబారు పత్రికల రాతలనూ ఎన్‌డీటీవీ వంటి సువార్త కూటముల ప్రచారాలనూ కనినా, వినినా అంతా మన మంచికేనన్న ఆనందం కలుగుతుంది. బాగానే ఉంది. కాని దేశమంతటా మారుమోగుతున్న ప్రచారార్భాటాన్ని గమనిస్తే సామాన్యులకు కొన్ని సందేహాలు రేకెత్తక మానవు.
1. పరీక్షకు పంపిన ఏడు వీడియోల్లో రెండు బనాయింపు వ్యవహారాలని తేలింది అంటే మిగతా ఐదూ నికార్సయనవి అనే అనుకోవాలి కదా? వాటిలో ఉన్నదేమిటి? ఎవరి మొగాలు, ఎవరి మాటలు, ఎవరిచ్చిన నినాదాలు అవి చూపెడతాయి? వాటిలో అభ్యంతకరమైన అంశాలు ఉన్నాయా లేదా? ఉంటే - వాటికి కన్నయ్య అండ్ కో ఇచ్చే సమాధానమేమిటి?
2. నేర పరిశోధనకు సంబంధించి వీడియో, ఆడియోల్లాంటి వాటి పరీక్ష జరగాలంటే వాటిని ఆధికారిక ఫోరెన్సిక్ లాబ్‌కి కదా పంపవలసింది? అన్ని హంగులూ కలిగిన సెంట్రల్ ఫోరెన్సిక్ లాబు హైదరాబాదులో అందుబాటులో ఉండగా, దాన్ని వదిలేసి, ప్రైవేటు లేబరెటరీని ఆశ్రయంచవలసిన అగత్యం ‘ఆప్’ సర్కారుకు ఏమి వచ్చింది? గవర్నమెంటు లాబ్‌ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని ‘ఆప్’ ప్రభువుల అభిప్రాయమా? నేర నిర్ధారణకు ఉద్దేశించబడిన ప్రభుత్వ సంస్థల నిజాయతీని, వృత్తి నైపుణ్యాన్ని ఏ కారణంతో శంకించారు? అటువంటి శంక ఏమి లేకపోతే ప్రైవేటు లాబ్ గడప ఎందుకు తొక్కారు? ఎవరి మీద బురద చల్లాలని?
3. దేశ రాజధాని నగరంలో నేరాల దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థ కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో కదా ఉండేది? జె.ఎన్.యు. నేరానికి సంబంధించి సమాంతర దర్యాప్తును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జరపదలచడంలోని ఆంతర్యమేమిటి? మేజిస్టీరియల్ దర్యాప్తు నెపంతో వీడియోలను ఏరికోరి ప్రైవేటు లాబ్ పరీక్ష నిమిత్తం పంపించినప్పటికీ అందులోని రాజకీయ దురుద్దేశం దాచేస్తే దాగుతుందా? ప్రజలెన్నుకున్న కేంద్ర ప్రభుత్వం చేయించే దర్యాప్తునకే విశ్వసనీయత లేదని ‘ఆప్’ వారి వాదన అయితే హెచ్.సి.యు., జె.ఎన్.యు. వివాదాల్లో అడ్డగోలుగా తలదూర్చిన కేజ్రీవాల్ పెత్తనంలోని రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వసనీయత ఎక్కడిది?
4. ఇంతకీ అసలు వివాదం- బయటికొచ్చిన వీడియో సాక్ష్యాల్లో ఏది అసలీ ఏదీ నకిలీ అనా? మాటవరసకు ఆ వీడియోలన్నీ నకిలీవే అయితే మాత్రం ఏమిటట? ఫిబ్రవరి 9న యూనివర్సిటీలో అనుమతి లేకపోయినా అక్రమంగా జరిగిన సోకాల్డ్ ప్రోగ్రామ్‌లో ‘్భరత్ నాశనమయ్యేదాకా యుద్ధం చేస్తా’, ‘ఇండియాని ముక్కలు చేస్తాం’, ‘కాశ్మీర్‌కి ఆజాదీని గుంజుకుంటాం’, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న నినాదాలు చేశారా లేదా? దేశద్రోహపూరితమైన పిచ్చికూతలు కూశారా లేదా? వాటికి సంబంధించి పోలీసు దర్యాప్తులో ఏమి తేలింది? దానిపై చట్ట ప్రకారం తీసుకోబోయే చర్యలేమిటి? ఏదో వీడియోలో ఎక్కడివో మాటలు అతికించారు, ‘ఎవరో ఏదో చేశారు’ అని చెప్పుకుని దోషులు తమ అపరాధాన్ని ఎంతకాలం కప్పి పుచ్చుకొనగలరు?
5. ‘న్యాయపరంగా జరిగిన అఫ్జల్‌గురు, ముఖ్‌బూల్ బట్‌ల హత్యలకు నిరసనగా’, కాశ్మీరీ వేర్పాటు పోరాటానికి మద్ధతుగా ఆ ప్రోగ్రాం పెట్టామని నిర్వాహకులే బహిరంగంగా ప్రకటించినప్పుడు ఆ రోజున జరిగింది జాతివ్యతిరేక దుశ్చర్య ఔనా కాదా అన్నది సందేహమా?
6. ఫిబ్రవరి 9 కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ ‘్ఢల్లీ స్టూడెంట్స్ యూనియన్’ (డి.ఎస్.యు.) వర్సిటీ అంతటా అంటించిన పోస్టరులను చూడండి. దానిలోని స్వర్ణాక్షరాలు ఇవి:

‘‘మూడేళ్ల కింద ఇదే ఫిబ్రవరి 9న భారత రాజ్యం ఒక వ్యక్తిని హత్య చేసింది. అతడిని చంపింది ప్రజాస్వామిక రాజ్యం కాదు... పగబట్టిన ద్వేషపూరిత రాజ్యం. ఈ రాజ్యం, దాన్ని పాలించే వర్గాలు సామాన్యులకు వర్తించే న్యాయానికి తాము అతీతులమనే ఎప్పుడూ అనుకుంటాయి. ఆ ప్రకారమే ఆ రోజున హడావుడిగా, కనీసం కుటుంబానికి, మిత్రులకు, సొంత లాయరుకు కూడా తెలపకుండా ఉరి ఉత్తర్వును రహస్యంగా జారీచేశారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీ తీహార్ జైలు అధికారులు అఫ్జల్‌గురును రహస్యంగా ఉరితీసి పాతిపెట్టారు.
‘‘కాని ఇది భారత రాజ్యపు సిగ్గుచేటు గతాన్ని పాతిపెట్టజాలదు...
‘‘విస్తరణకాంక్షగల... అణచివేసే... బ్రాహ్మణిక భారత రాజ్యంపై అసమ్మతి స్వరాన్ని వినిపించేందుకు ఎవరు సాహసించినా ఈ రాజ్యం ఇలాగే ఉరి తీస్తుంది... కాశ్మీర్ లోయ ప్రజలకు భారత రాజ్యం చేసిన చారిత్రక అన్యాయానికి అఫ్జల్‌గురు ప్రతీక. కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, గూర్ఖాలాండ్ ప్రజల మనసుల్లో 60 ఏళ్లుగా భయోత్పాతం కలిగిస్తూనే ఈ రాజ్యం కపట ప్రేమ నటిస్తోంది. తనది ప్రజాస్వామ్యమని చెప్పుకోవటానికి ఈ రాజ్యానికి గల హక్కును మేము మరోసారి ప్రశ్నిస్తున్నాము.
‘‘ఇండియా నుంచి విడిపోయి, స్వాతంత్య్రం పొందటం ప్రతి కాశ్మీరీకీ ప్రాథమిక హక్కు... మనందరం కలిసి వారికి సంఘీభావం తెలుపుదాం.’’

ఏమంటారు లెఫ్ట్, లిబరల్, సెక్యులర్ మహామేధావులు? ఇదంతా అసమ్మతి తెలిపే రాజ్యాంగ హక్కు కిందికి వస్తుందా? ఏ ప్రాథమిక హక్కు అయినా భారతదేశ భద్రతకు, సార్వభౌమత్వానికి లోబడే ఉండాలని రాజ్యాంగం 19 (1) అధికరణంలో విధించిన షరతు జె.ఎన్.యు.లో పీఠం పెట్టిన జాతి వ్యతిరేక శక్తులకు వర్తించదా? భారత రిపబ్లిక్ నుంచి కాశ్మీర్ విడిపోవాలనటం, 60 ఏళ్లుగా దేశానే్నలుతున్నది అణచివేసే బ్రాహ్మణిక రాజ్యమనడం, దానికి ప్రజాస్వామ్యమని చెప్పుకునే హక్కే లేదనడం కూడా భావప్రకటన స్వేచ్ఛ అనే ప్రజాస్వామిక హక్కు కిందికే వస్తుందా? ఈ రకమైన దేశద్రోహపూరితమైన పోస్టరును పబ్లిక్ యూనివర్సిటీలో ఎలా అనుమతించారు? పోస్టరే ఇంత రెచ్చగొట్టేలా ఉన్నప్పుడు అసలు కార్యక్రమంలో దేశ ద్రోహపు కూతలే కూశారనడంలో సందేహమా? దానికి వీడియో రుజువులూ, వాటికి కేజ్రీవాల్ సర్ట్ఫికేట్లూ కావాలా?
7. కేవలం ఒక పోస్టరును బట్టి యూనివర్సిటీ పోకడపై నేరారోపణ ఎలా చేస్తామన్న విచికిత్సకు తావు లేదు. ఫిబ్రవరి 9 ‘సాంస్కృతిక సాయంత్రం’ని వెలగబెట్టిన విద్యార్థి సంఘమే తన ద్రోహబుద్ధిని జంకులేకుండా బయటపెడుతూ ఈ పోస్టరు వేసింది. పార్లమెంటుపై దాడి చేసి, అత్యున్నత న్యాయస్థానపు నిర్దుష్ట నిర్ణయం ప్రకారం చట్టబద్ధంగా ఉరితీయబడ్డ అఫ్జల్, మఖ్‌బూల్ అనే జాతి శత్రువులకు నివాళులర్పించే జాతి వ్యతిరేక కార్యానికి యూనివర్సిటీ అధికారులు అనుమతి రద్దుచేయగా, అలా ఎలా రద్దుచేశారని రిజిస్ట్రారుతో వాదులాడిన ‘జాతిరత్నం’ మన కన్నయ్య బాబే!
జె.ఎన్.యు.కి పట్టిన జాతి వ్యతిరేకపు చీడ ఈ ఫిబ్రవరిలోనే మొదలు కాలేదు. కాశ్మీర్ నుంచి హిందువులను రాక్షసంగా తరిమేసి, మొత్తం లోయను ముస్లింలు ఆక్రమించిన దరిమిలా ఏకంగా భారత రిపబ్లిక్ నుంచే కాశ్మీర్‌ను వేరు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ఏజెంట్లు రెండు దశాబ్దాల కిందటే (1995 నవంబర్ 15న) జెఎన్‌యు కాంపసులో ఒక సెమినార్ నిర్వహించారు. మరోసారి దేశ విభజన జరగాలంటూ అందులో డిమాండు చేశారు.
పదహారేళ్ల కింద (2000లో) కమ్యూనిస్టులు జెఎన్‌యులో ఒక ముషాయిరా పెట్టారు. పాకిస్తానీ కవులను దానికి పిలిచారు. వచ్చిన పాకీ కవులు భారతదేశాన్ని, భారత సైన్యాన్ని తిట్టి పోస్తూంటే మేజర్ కె.కె.శర్మ, మేజర్ ఎల్.కె.శర్మ అనే భారత సైన్యాధికారులు అభ్యంతరం తెలిపారు. కామ్రేడ్లు వారిపై చేయి చేసుకున్నారు.
పార్లమెంటుపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను సమాదరించే కార్యక్రమాన్ని జెఎన్‌యులో కమ్యూనిస్టులు 2003లో జరగనివ్వలేదు.
2010లో దంతెవాడలో నక్సలైట్లు 76 మంది సిఆర్‌పి జవాన్లను హతమార్చినందుకు జెఎన్‌యులోని కమ్యూనిస్టు యూనియన్లు ‘‘ప్రజలపై యుద్ధాన్ని వ్యతిరేకించే జెఎన్‌యు ఫోరం’’ పేరుమీద పెద్ద పండుగ చేసుకున్నారు.
భారతరత్నం, యువతకు ఆదర్శం అయిన మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం నిరుడు మరణించినప్పుడు కనీసం సంతాపమైనా ప్రకటించని జెఎన్‌యు విద్యార్థి దళాలు అదే వారంలో యాకుబ్ మెమెన్ అనే టెర్రరిస్టు నరపిశాచిని చట్ట ప్రకారం ఉరి తీసినప్పుడు మాత్రం ఇండియాను ‘‘హంతక రాజ్యం’’గా దూషిస్తూ పెద్ద ఊరేగింపు తీశాయి.
8. ఇలా కనీసం రెండు దశాబ్దాలుగా బరితెగించి సాగుతున్న జాతి వ్యతిరేక దుశ్చర్యలకు పరాకాష్ఠే కాదా ఈ ఫిబ్రవరి 9న ‘్భరత్‌కి బర్‌బాదీ తక్ జంగ్’’ ప్రేలాపన? మీడియా తీర్పరులకు, కమ్యూనిస్టు మేధావులకు, కాంగ్రెసు మైనర్లకు, క్రేజీ ‘ఆపా’త్ములకు నమ్మకం కుదిరేంత స్ఫుటంగా వీడియో సాక్ష్యంలో మొగాలు కనపడలేదు, గొంతులు వినపడలేదు అని దాటేసినంత మాత్రాన అసలు పాపం మాయమవుతుందా? జాతి వ్యతిరేక శక్తులకు ఆటపట్టుగా, విద్రోహ భావాల ఉత్పత్తి కేంద్రంగా మారాయని తేలిపోయాక కూడా ఇలాంటి ఉన్నత విద్యావ్యవస్థలను సమూలంగా క్షాళన చేయకుండా ఊరుకోవాలా?
బిడ్డల్ని కనే వయసొచ్చినా, 29వ ఏట కూడా తాను విద్యార్థినేనని చెప్పుకుంటూ ప్రజల సొమ్ముతో సబ్సిడీలను తేరగా అనుభవిస్తూ యూనివర్సిటీని పట్టుకుని వేలాడేవాడు విద్యార్థి నాయకుడుగా చలామణి కావటంలో తప్పులేదు. కాని - యూనివర్సిటీ కాంపసులో రోడ్డుమీద ఎద్దులా మూత్రం వదులుతూండగా ఒక మహిళ చూసి మందలిస్తే సిగ్గుపడవలసింది పోయి, ఆమెకే మతి చెడిందంటూ దుర్భాషలాడిన వాడు... ఆ అపరాధానికిగాను యూనివర్సిటీకి నిరుడు మూడువేల రూపాయల జరిమానా కట్టి చివాట్లు తిన్న ప్రబుద్దుడు కాశ్మీర్ మహిళలపై భారత సైనికుల అత్యాచారాల గురించి మహిళా దినోత్సవం నాడు వేదికలెక్కి వాగటమే వింత. అతడేదో వినూత్న రాజకీయ ధృవతార అయినట్టు, రేపటి జాతీయ నాయకుడు, ప్రధాని కాదగినవాడు అతడేనంటూ ఓవరయ్యే వాళ్లను చూస్తే మరీ రోత.

ఎం.వి.ఆర్.శాస్త్రి