ఉన్నమాట

కమలం చెంతనుండగా కాంగ్రెసుకెందుకు చింత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారం ఉన్నది దుర్వినియోగం చేయడానికి.
ఇది కాంగ్రెసు వారి రాజనీతి. పవరు రుచి మరిగాక భాజపాకూ బాగానే ఒంటబట్టింది.
కాంగ్రెసు పాలకులు స్వార్థ రాజకీయ లబ్ధికోసం గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేవారు. విధం చెడ్డా, అప్రతిష్ఠ మూటగట్టుకున్నా కనీసం తాత్కాలిక ఫలాన్ని సాధించేవారు. కమలం వారికి ఆ తెలివి తేటలు కూడా లేవు. అర్థంపర్థం లేకుండా అడ్డగోలుగా రాష్ట్రప్రభుత్వాలను కూల్చి, కంగాళీగా చేతులు కాల్చుకోవడం వారి ప్రత్యేకత.
దానికి రుజువు ఉత్తరాఖండ్ రసాభాస.
ఆ రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని దాని మానాన దాన్ని వదిలేసి ఉంటే, త్వరలో ఆయువుతీరి దానికది సహజమరణం చెంది ఉండేది. అసలే దానికి పుట్టెడు సమస్యలు. అధికారం చేతికంది నాలుగేళ్లు దాటింది. ప్రజల్లో ఎన్ని విధాల భ్రష్టుపట్టాలో అంతగానూ భ్రష్టుపట్టింది. ఆకస్మిక వరదల విలయాన్ని ఎదుర్కోవటం చేతకాక చతికిలపడి కొన్ని జీవిత కాలాలకు సరిపడినంత చెడ్డపేరు తెచ్చుకుంది. దాన్ని బాపుకోవటానికి ముఖ్యమంత్రిని మార్చినా ఉపయోగం సున్న. కొత్తగా వచ్చినవాడు అవినీతిలో, అసమర్థతలో అతడికంటే ఘనుడు. పదవి ఊడిన పాతవాడు అసమ్మతిని ఎగదోసి కొత్త ముఖ్యమంత్రి బతుకును దుర్భరం చేస్తున్నాడు. వచ్చే ఏడు రానున్న ఎన్నికల్లో పార్టీ పడవ మునగకుండా ఉండాలంటే తమరు దిగిపోక తప్పదని హరీష్ రావత్‌కి పార్టీ అధిష్ఠానం కావలసినన్ని సంకేతాలు ఇచ్చింది. అమిత్‌షా గారి చల్లని చూపు ఉత్తరాఖండ్ మీద పడకుండా ఉండి ఉంటే, పార్టీ పెద్దలే రావత్‌ని సాగనంపేవారు. లేదా అసమ్మతి తలనెప్పి తగ్గించుకోవటానికి ముఖ్యమంత్రిని బలవంతపెట్టి అసంతృప్తులను కేబినెట్‌లో చేర్పించేవారు. అసమర్థ ప్రభుత్వానికి సహజంగా ఉండే ప్రజావ్యతిరేకత కారణంగా ఇంకో పదినెలలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెసు తుక్కుతుక్కుగా ఓడిపోయి ఉండేది. బలమైన ప్రత్యామ్నాయంగా బహుశా బిజెపియే రాజమార్గాన అధికారం అందుకోగలిగేది.
ఇంత చక్కటి అవకాశం కళ్లముందు ఉన్నప్పుడు బుద్ధి ఉన్నవాడెవడూ సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు పనికిమాలిన ప్రభుత్వాన్ని పనిగట్టుకుని పడగొట్టడు. అలా చేస్తే మరికొద్ది నెలల్లో ఎలాగూ తప్పని ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, తమకు అవకాశం ఇమ్మని కోరే చాన్సు ఉండదు.
ఆ పాటి ఇంగితజ్ఞానం లేకుండా, కేంద్రం చేతిలోని అధికారాన్ని దుర్వినియోగపరచి, అసెంబ్లీలో బలపరీక్ష జలగడానికి సరిగ్గా ఒక రోజు ముందు 356 అధికరణం కింద హరీష్ రావత్ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా బర్తరఫ్ చేయడంతో కాంగ్రెసునెత్తిన పాలుపోసినట్టయింది. గుట్టుచప్పుడు కాకుండా కథ నడుపుతున్న అసంతుష్టులను కమలనాధులు రచ్చకీడ్చి తిరుగుబాటు వర్గంగా కూడ గట్టటంతో అందరి శాసనసభ సభ్యత్వాలనూ ఏకమొత్తంగా ఊడగొట్టటం స్పీకరుకు సుకరమైంది. బలపరీక్ష గట్టెక్కటానికి విపక్షం ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు దిగిన కాంగ్రెసు ముఖ్యమంత్రి బండారం స్టింగ్ ఆపరేషనులో బయటపడితేనేమి? రాష్ట్ర బిజెపి నాయకుడు లగ్జరీ హోటలు నుంచి సొంత సంతాను తెరిచి, పోటీ క్యాంపును నడపటంతో దొందూ దొందే అన్న అభిప్రాయం జనాలకు కలిగి, కాంగ్రెసు కాస్త తెప్పరిల్లింది. సుప్రీంకోర్టు అజమాయిషీ కింద జరిగిన బలపరీక్షలో ఐదు ఓట్ల తేడాతో గట్టెక్కడంతో రావత్ పదవి నిలిచింది. 356 అధికరణ దుర్వినియోగంతో గిట్టని రాష్ట్ర ప్రభుత్వం ఉసురు తీయబోయిన మోది సర్కారు కుత్సితానికి బలి అయిన బాధితుడిగా... సుప్రీంకోర్టు అండతో ఆ ఘాతుకాన్ని ఎదుర్కొని నిలిచిన వీరుడిగా ప్రజల్లో ప్రచారం చేసుకుని, ఎన్నికల్లో సానుభూతి ఓట్లను రాబట్టుకోవటం హరీష్ రావత్‌కు సుకరమవుతుంది.
ఇది భాజపేయులు చేతులారా చేసిన మేలు. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన మిత్రుడు. ఆ రకంగా చూస్తే బిజెపియే కాంగ్రెసుకు బెస్టు ఫ్రెండు!
పూర్వపు కాంగ్రెసు రాజ్యంలో 356 రాజ్యాంగ అధికరణాన్ని కేంద్ర ప్రభువులు దుర్వినియోగం చేసి, విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వాల ఉసురు తీయగలిగారంటే అప్పటి పరిస్థితులు వేరు. 1994 నాటి డ గ ఱ్య్ఘౄౄజ ఒ. శ్రీశజ్యశ యచి నిశజూజ్ఘ కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక న్యాయ నిర్ణయం తరవాత కేంద్రానే్నలే వారి దుందుడుకు దూకుడుకు ముకుతాడు పడింది. కొంతమంది లెజిస్లేటర్లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అన్ని సందర్భాల్లోనూ మంత్రివర్గ బలపరీక్ష చట్టసభలో మాత్రమే జరగాలని, దీనికి సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం చేసే అధికారం ఎంతటి వారికీ లేదని బొమ్మయి కేసులో సర్వోన్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. ప్రభుత్వం మనుగడకు సంబంధించి వ్యక్తిగత విశే్లషణలు, ‘ప్రైవేటు అభిప్రాయాల’పై ఆధారపడి నిర్ణయం చేసే అధికారం గవర్నరుకు, రాష్టప్రతికి కూడా లేదని కోర్టు విస్పష్టంగా ప్రకటించింది. ఆ సంగతి తెలిసి కూడా, తన తాహతును అతిగా ఊహించుకుని అహంకరించి, బలపరీక్షకు ఒక్కరోజు ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోదీ సర్కారు వేటు వేయటం ఏ రకంగా చూసినా అనుచితం, రాజ్యాంగ విరుద్ధం, ఆత్మహత్యాసదృశం.
తాము విపక్షంలో ఉన్నంతవరకూ 356 అధికరణం దుర్వినియోగం, కాంగ్రెసు ప్రభుత్వాల ఇష్టారాజ్యాలపై ధ్వజమెత్తి, ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాల గురించి పెద్ద నీతులు చెప్పిన బిజెపి గుణవంతులు అధికారం చేతికందాక తాము సైతం అదే కాంగ్రెసు అడుగు జాడల్లో నడవడం నగుబాటు. ఆ మధ్య అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆ ఎత్తు పారింది కాబట్టి, అదే వరసలో ఉత్తరాఖండ్‌లోనూ ఉట్టి కొట్టగలమని కమలనాధులు కన్నుగానకుండా బరితెగించడం దిద్దుకోలేని తప్పు. కాంగ్రెసు చూపిన దారినే వారు పోదలిస్తే కాంగ్రెసుకు పట్టిన గతే వారికీ పడుతుంది. తాగనేరని పిల్లి బోర్ల పోసుకున్నట్టు స్వయంకృతాపరాధాల మూలంగా భాజపేయులు ప్రజలందించిన అధికారాన్ని నిలుపుకోలేకపోతే అది వారి ఖర్మ. భారత రాజ్యాంగం అమలయ్యాక ఇప్పటికి ఎన్ని ప్రభుత్వాలు రాలేదు? ఎన్ని పోలేదు?
కాని ఈ సందర్భంలో వివేకం ఉన్నవాళ్లందరూ ఆలోచించాల్సింది ఒక బిజెపి లేక ఒక నరేంద్రమోది రాజకీయ భవిష్యత్తు గురించి కాదు. మోదీ సర్కారు హద్దుమీరి చేజేతులా తెచ్చిపెట్టిన తంటా మూలంగా రాజ్యాంగ వ్యవస్థలకు, ఆ వ్యవస్థల నడుమ సమతౌల్యానికి వాటిల్లిన, లేక వాటిల్లగల చేటు ఏమిటన్నదే జాతి మొత్తం దృష్టి సారించాల్సిన సమస్య.
ఉత్తరాఖండ్ ఉత్తరకాండలో మొదటి ముద్దాయి బిజెపి. నిజమే. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఉత్తరాది రాష్ట్రంలో చేయబూనిన ప్రజాస్వామ్య హననాన్ని ఎవరైనా తెగనాడవలసిందే. తెగనాడటం తేలికే. కాని కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దే క్రమంలో రాజ్యాంగ క్షేత్రంలో ఎటువంటి వింత పరిణామాలు నెలకొన్నాయో గమనించారా?
శాసన నిర్మాణ, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలు మూడూ రాజ్యాంగ సౌధానికి మూడు మూల స్తంభాలు. దేని పరిధిలో అది సుప్రీమ్. ఒక వ్యవస్థ కార్యరంగంలోకి వేరొక వ్యవస్థ జోక్యం తగదు. పెత్తనం అసలే కూడదు. చట్టసభకు సంబంధించినంత వరకూ సభాపతి నిర్ణయానికి తిరుగులేదు. సభా నిర్వహణ, సభా కార్యక్రమాలకు సంబంధించి కలగజేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగాధినేతలైన రాష్టప్రతి, గవర్నరు నిర్ణయాలను నేరుగా ప్రశ్నించే, ఆక్షేపించే అధికారం ఎవరికీ లేదు. ఇదే కదా ఇప్పటిదాకా ఎందరో రాజ్యాంగ దిగ్దంతులు, న్యాయపారంగతులు, పార్లమెంటరీ ప్రవీణులు నొక్కి చెబుతూ వచ్చింది? రాజ్యాంగకర్తలు ఉద్దేశించిన వ్యవస్థల నడుమ సమతూకం ఉత్తరాఖండ్ పరిణామాల్లో ఎటువంటి వికృతికి లోనైందో చూశారా?
లెజిస్లేచర్ వ్యవస్థ సర్వసత్తాక అధికారం మేరకు సభాపతి నియంత్రణలో జరగవలసిన బలపరీక్ష సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది. సభలో బలపరీక్ష ఎలా జరగాలి, దాని నియమాలు, విధివిధానాలు ఏమిటి అన్నది సభాపతి కాదు - సుప్రీంకోర్టు నిర్ణయించింది. తిరుగులేని నిర్ణయాధికారం కలదనుకునే సభాపతి శాసనసభా వేదికపై ఆధికారికంగా ప్రకటించవలసిన ఓటింగు ఫలితాన్ని మరునాడు కోర్టు హాలులో సుప్రీంకోర్టు ప్రకటించింది. తొమ్మిది మంది లెజిస్లేటర్లను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించిన సభాపతి నిర్ణయాన్ని అదృష్టవశాత్తు న్యాయస్థానం సమర్ధించింది కాబట్టి సరిపోయింది. కాని - ఇదే వ్యవహారశైలిని అందరూ అంగీకరించే పక్షంలో, రేపు వేరొక రాష్ట్రంలో వేరొక కోర్టు అలాంటి నిర్ణయానే్న చెల్లదని కొట్టివేయవచ్చు. ఇదే ఒరవడి రూఢి అయితే చట్టసభను ఎలా నడపాలో, సభాపతి ఎప్పుడు ఏ రూలింగు ఇవ్వాలో కూడా కోర్టులే నిర్దేశించే పరిస్థితి రాదని కచ్చితంగా చెప్పగలమా? సర్వోత్కృష్టమైన లెజిస్లేచరు న్యాయవ్యవస్థ ముందు న్యాయార్థిగా నిలబడవలసి వస్తే... చట్టసభలో వేసిన ఓట్ల వివరాలను కట్టగట్టి కోర్టుకు నివేదించి, ఫలితం ఏమిటో ఆనతియ్యవలసిందని అభ్యర్థించవలసివస్తే రాజ్యాంగ వ్యవస్థల సమతౌల్యం ఏమైనట్టు?
అరుణాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఒక దశలో ఏకంగా గవర్నరుకే నోటీసు ఇవ్వబోయింది. ఉత్తరాఖండ్ హైకోర్టు రాజ్యాంగాధినేత అయిన రాష్టప్రతిని పట్టుకుని ‘ఆయనేమైనా రాజాధిరాజా? అసలు తప్పే చేయడా?’ అని నిండు కోర్టులో చులకనగా మాట్లాడింది. గవర్నర్లు, రాష్టప్రతి... పార్లమెంటు, అసెంబ్లీల సభాపతులు సరిగా పనిచేస్తున్నారో లేదో కనిపెట్టి, ఎవరు ఎలా నడచుకోవాలో ఆజ్ఞాపించే హక్కు న్యాయస్థానాలకు ఉన్నదా? ఉంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా? న్యాయనియంతృత్వమా?
ఒక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక మోదీ సర్కారుకు జరిగిన శృంగభంగం కంటే... ఆ రాష్ట్రంలో సుప్రీంకోర్టు చేసిన చక్కటి న్యాయ నిర్ణయాలకు మించి... ఆలోచనాపరులు, ప్రజాస్వామ్య హితైషులు అందరూ దృష్టి పెట్టదగిన వౌలిక ప్రశ్నలివి. వీటిని రాజ్యాంగ నిపుణులు, పార్లమెంటరీ దిగ్గజాలు ఎంత త్వరగా తేలిస్తే రాజ్యాంగ వ్యవస్థకు అంత క్షేమం.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ