ఉత్తరాయణం

చట్టం ముందు అంతా సమానమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులు అది ఒక్కోసారి సంధించే ప్రశ్నలు ప్రజల్ని అయోమయంలో పడేస్తాయ. దైవదర్శనానికి వచ్చే స్ర్తిలు సంప్రదాయ దుస్తులు ధరించాలని, పురుషులు పంచెకట్టుతో రావాలని కొన్ని ఆ లయాలు నిర్దేశించగా మత విశ్వాసాల్లో కోర్టులు కలుగజేసుకోవని సుప్రీంకోర్టు చెప్పిందొకసారి. ఇప్పు డేమో శబరిమలలో స్ర్తీలకు ప్రవేశం నిషేధించడం రాజ్యాంగ బద్ధం కాదు కదా అని కోర్టు ప్రశ్నిస్తున్నది. చట్టం ముందు అందరూ సమానమే అంటారు. ఒకవర్గం వారు మాట మాత్రంగా భార్యకు విడాకులిచ్చేసి ఎందరి నైనా పెళ్లి చేసుకోవచ్చు. కుటుంబ నియంత్రణను పాటిం చనక్కరలేదు. చట్టం ముందు సమానత ఎలా ఉంటుంది?
- సత్య, కరప, తూ.గో. జిల్లా
లౌకిక రాజ్యంగా నేపాల్
నేపాల్ ఏకైక హిందూ రాజ్యంగా ఉండేది. పశుపతి నాథుని దేవాలయంతో అలరారుతుండేది. ఈ చిన్న రాజ్యాన్ని లౌకిక రాజ్యంగా మార్చేశారు. లౌకిక రాజ్యంలో మతాలు మార్చుకోవచ్చు. లౌకిక రాజ్యంగా ఉన్నప్పటికీ మరొక మతం వ్యవహారంలో జోక్యం కలుగ జేసుకోకుండా ఎవరికివారు తమ విశ్వాసాన్ని తాము కొనసాగించడంలో తప్పు లేదు.
-వి. కనకరాజు, విశాఖపట్టణం
ఆహార భద్రతా కార్డులు ఇవ్వాలి
గత కొద్ది సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వ ఉద్యోగ రిక్రూట్‌మెంట్లు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినవారు, తెల్లరేషన్ కార్డుల్లో ఫొటోలు పేర్లతోసహా అలాగే ఉన్నారు. వీరిని తొలగించి ఆహార భద్రతా కార్డులు జారీచేయాలి. ఉదాహరణకు 2008 డిఎస్సీలో 53వేల పైచిలుకు ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. వీరంతా పాత తెల్లరేషన్ కార్డుల్లో అలాగే ఉన్నారు. వీరిని తొలగించాలి.
- బండా గురునాథ్, పత్తికొండ
దంతాలకు మూలకణ చికిత్సలు అవసరం
నోటిలోని చిగుళ్ళలోకి మూలకణాలని పంపి, క్లోనింగ్ జరిపి దంతాలు మొలిపిస్తే దంతవైద్య చికిత్సవిధానంలో విప్లవాత్మక మార్పుకాగలదు. దంతాలు కోల్పోయిన ఎందరికో ఇది దారిచూపగలదు. దంతవైద్యులు, దంతశాస్తవ్రేత్తలు ఈ విషయాన్ని పరిశీలించి పళ్ళుకోల్పోయిన వారి నోటిలోని చిగుళ్ళలోకి మూలకణ చికిత్స ద్వారా (స్టెమ్‌సెల్స్) ద్వారా దంతాలను మొలిపించేందుకు వీలుగా పరిశోధనలు జరపాలి. వృద్ధులకు ఇది ఎంతో ప్రయోజ నకరంగా ఉంటుంది.
- కె.వెంకటేశ్వర్లు, కరీంనగర్
హిందూ ధర్మాన్ని పాటించాలి
ప్రతీ హిందూ వ్యక్తి హిందూ సాంప్రదాయాన్ని పాటించాలి. ఇంటిముందు తులసిమొక్క ఇంటి గోడలపై వివిధ హిందూ దేవీదేవతల ఫొటోలు కట్టూబొట్టూ సంప్రదాయం, శుచీ ఇవన్నీ హిందూ ధర్మంలో సంప్రదాయాలు. హిందూ మత సంచార దేవాలయాలు ప్రతీ జిల్లాలోనూ ఉండాలి. అందులో హిందూ ధర్మ ప్రవచనాలు వినిపించాలి. హిందూ ధర్మం గొప్పతనం, వివిధ వ్రతాలు, పూజలు, హోమాది కార్యక్రమాలు ప్రతీ వీధిలో వినిపించాలి. రాజకీయ నాయకులు హాట్‌బ్యాంక్ పాలిటిక్స్ మానుకోవాలి. అయితే హిందూ మతంపై నమ్మకం లేనివారు మాత్రం నాస్తికత్వం పాటించవచ్చు. నాస్తికులు ఏ మతాన్ని నమ్మరు కనుక మతమార్పిడి ప్రసక్తే ఉండదు.
- శశికుమార్, కంచరపాలెం
ప్రభుత్వ బడులు
1) ప్రభుత నడుపుతున్న బడులన్ని పాతబడెన!
ఉచిత భోజన వసతులునుంచి యున్న
విద్యసాగదు నెందుకో? వివరణేది?
పెట్టుబడి లేని చదువన్న పట్టుబడద!
2) భార్య సంసార బంధాన భక్తి, యుక్తి
శక్తియున్నను వెలయాలి రక్తి లాగ
అక్షయంబగు విద్య నీపక్షమగును.
నేర్వబూనుట ముఖ్యంబు నేర్పునందు
3) చదువుకొనగల్గువారికే పదవులనెడి
ఆంధ్రవర్యులకాజ్ఞలు నందినట్లు
ధనము వెచ్చించి చదువుమా! మానిషియనగ!
బీద విద్యార్థి బ్రతుకున మోదమేది?
4) చదువగల్గుట ముఖ్యంబు సంఘమందు
బడులుయేవైన నేర్చుట బాధ్యతనుచు
తల్లిదండ్రులు పిల్లలు దలచినపుడు
విద్య, వినయంబు విధులందు విలువలొసగు!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
గ్రామాల్లో సిమెంటు రోడ్లు
ప్రస్తుతం ప్రతి గ్రామంలోను వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సి.సి. రోడ్లుకు నిధులు భారీగా కేటాయింపులు జరగడం గమనార్హం. రెండోవైపు ప్రభుత్వం పల్లెల్లో ప్రతి యింటికి, వాన నీరు నిల్వకు గాను యిం కుడు గుంటల త్రవ్వకాలను ప్రోత్సహించడం విశేషం. ఇట్లా పల్లెల్లో పలుకుబడి గలిగిన వార్డు మెంబరునుండి మోతుబరుల వరకు తమ తమ ఇళ్లముందు మారుమూల సందులకు సి.సి రోడ్లు వేయించుట మూలంగా గ్రామాలు మొత్తం కాంక్రీటు జంగిల్ అయి వర్షపునీరు భూమిలోకి యింకే పరిస్థితులు లేకుండా పోయాయ. కనుక గ్రామా ల్లో ప్రధాన రహదారులకు మాత్రమే సిసి రోడ్లు వేసి, ఇతరత్రా కంకర రోడ్లు వేస్తే వర్షపునీటిని ఇంకుడు గుంటల్లోకి పట్టవచ్చు. దీని ద్వారా భూగర్భ జల సంపద పెరిగి త్రాగునీటి ఎద్దడి కొంతమేర తగ్గుతుంది.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు