ఉత్తరాయణం

ప్రణాళిక లేని అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడం అభినందనీయం. అయితే ప్రణాళికా లోపంవల్ల అందరికీ పండుగలా ఉండవలసిన కార్యక్రమం, ప్రభుత్వానికి ప్రదర్శన వేదికగా, పిల్లలకు వారి తల్లిదండ్రులకు పరుగుల పందెంగా తయారైంది. వేల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడమే ఒకట్రెండు రోజుల ముందు అదీ ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుపతిలో దూర ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. బస్సుల్లో, రైళ్లల్లో సీట్లు దొరక్క అదే ఓ వారం, పది రోజులు ముందుగా తెలిసుంటే చక్కగా రాగలిగి ఉండేవారు కదా!
అందరూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందాలనే భావిస్తారు. అయితే వేల మందికి ఒకేసారి ఆయన ఇవ్వడం అసాధ్యం. అలా అని ఇంత దూరం వచ్చి ఏదో కౌంటర్‌లో సినిమా టికెట్ తీసుకునే పరిస్థితిలా ఉండటం భావ్యం కాదు. ఇక్కడదే జరిగింది. ముఖ్యమంత్రి కాదుకదా జిల్లా కలెక్టరు చేతుల మీదుగానైనా అవార్డు పొందలేక దాదాపు అందరూ నిరాశపడ్డారు. కనీసం వందకు వంద మార్కులు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకైనా ఆ అదృష్టం దక్కాల్సింది. కాస్త గౌరవంగా ఉండేది. ఇలాంటి కార్యక్రమాల ముఖ్యోద్దేశ్యం విద్యార్థులని వెన్నుతట్టడం. కాబట్టి ఏ జిల్లాకాజిల్లా పరంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి, పిల్లలకు ఇబ్బందులు తగ్గుతాయి. సందేశం గౌరవం చివరి విద్యార్థి వరకూ చేరుతాయి.
- డా.డి.వి.జి.శంకరరావు, విజయనగరం
తొలగుతున్న అపోహలు
కొన్ని ఛానల్స్‌లో ‘బ్రతుకు జట్కాబండి- అందమైన జీవితం’ వంటి ప్రోగ్రామ్స్ సామాజిక కుటుంబ సమస్యలపై పరిష్కారాన్ని చూపుతూ ఎన్ని కుటుంబాలలో నెలకొన్న అపోహలను తొలగించటం జరిగింది. అందుకు అభినందనీయం. సామాజికవేత్తలు, అనాథ హోంలు పోలీస్ శాఖ, సెలబ్రిటీస్, సైకాలజిస్ట్‌లతోపాటు ఎందరో లాయర్లు, విజ్ఞులు అందిస్తున్న సలహాల సూచనలు ఆదర్శనీయం. ఈ షోలు అయిపోయిన అనంతరం పైవారు అదే స్ఫూర్తిని కనబరుస్తారా! వారి పరిస్థితి ఏమిటి. మళ్ళీ వారికి సమస్యలు తలెత్తేనాటికి ఈ ప్రోగ్రాం లేకపోవడం. ఏ ప్రోగ్రాం జీవితాన్ని ఇచ్చిందో అది లేకపోతే వారి పరిస్థితి ఏమిటి? అందరు వారి వారి వృత్తిలో బిజిగా ఉంటారు. వీరి న్యాయం చేస్తారా! అందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత ఛాల్స్‌పై సెలబ్రిటీలపై ఉంది. దీని విమర్శనాత్మకంకగా చూడటం లేదు. ఒక సందేహం మాత్రమే. ఏది ఏమైనా ఈ ప్రోగ్రామ్స్ కొందరికి పునర్జన్మ భవిష్యత్తును ఇస్తున్నాయనటంలో సందేహం లేదు.
- అయినం రఘురామారావు, ఖమ్మం
ధరలు
1) ధరలు బెరగకున్న? దడబుట్టు రైతుకు
తగ్గకున్న కూలినెగ్గుటెట్లు?
మధ్యవర్తి నేడు మహరాజుగా మారె!
సొమ్ము నొకరిదైన షోకు, కొకరు!
2) భేర సారమందు బేహారి బ్రతుకెట్లు?
ఆటుపోట్ల ధరలు చేటు గూర్చ
ఆశనధికమైన ఆయుష్యు దగ్గును!
అన్నసూత్రమెవరికంటదేల?
3) కరవమన్న కప్ప! తరిమిన పాముకు
సంకటంబుగాదె. బింకమున్న
ప్రభుత రైతు, కూలి బ్రతుకును గమనించ
త్రాసు ముల్లు లాగ తరిగి బెరుగు!
4) ఉన్నవారి చెంత కన్నవారుండినా
ప్రేమ పెంపులేక పెరుగుటాయె!
ధరలవోలె ఆశ కరుణయు మాన్పగ
మానవత్వముండి మరుగుబడుటె!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
కనీస సౌకర్యాలు కరవు
గుంటూరు జిల్లాలో వివిధ మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలలో సందర్శకులకు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వివిధ పనులకోసం వచ్చే ప్రజలకు త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, కాసేపు వేచి వుండేందుకు ప్రత్యేక గది, కూర్చునే సదుపాయాలు వంటి కనీస సదుపాయాలు కూడా కొరవడ్డాయి. ప్రజలు గంటలకొలదీ ఆఫీసుల ప్రాంగణంలో వున్న చెట్ల క్రింద ఎండ వానలకు తడుస్తూ వేచి వుండే దయనీయ పరిస్థితులు వున్నాయి. కొన్ని కార్యాలయాలలో ఉన్న వాటర్ కూలర్లు, ఫ్యాన్లు పనిచెయ్యకపోయినా పట్టించుకునే వారు లేరు. మరికొన్ని కార్యాలయాలలో మరుగుదొడ్లు కూడా లేకపోవడంవలన ప్రజలతో పాటు అధికారులు కూడా ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తున్నారు. తమ ఫిర్యాదులను సకాలంలో ఎలాగూ అధికారులు పరిష్కరించరు, కనీసం కనీస సౌకర్యాలు ఏర్పాటుచేస్తే చాలన్న భావన ప్రజలలో వ్యక్తవౌతోంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి
ఎవరిని మభ్యపెడతారు?
మేము జీవించే ఉన్నాం అని చెప్పడానికి కాబోలు ప్రత్యేక హోదాని భుజాలకెత్తుకొని కోటి సంతకాల ఉద్య మం. తర్వాత వెయ్యి పోలీసుస్టేషన్లలో పియం, సియం, వెంకయ్య మోసగాళ్లంటూ కేసులు పెట్టించారు రఘువీరుడు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేట్టు కేంద్రాన్ని ఆదేశించాలంటూ తెలంగాణా వాది వేసిన పిల్‌ని విచారిస్తూ ఆ అధికారం మాకు లేదని కోర్టు తేల్చేసింది. మీరు వేసిన మోసం కేసు గతి ఏమిటి రఘువీరా?!
- శుభ, కాకినాడ