ఉత్తరాయణం

పవన్ వాదన సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లోకి కొత్తరక్తం రావాలని, అప్పుడే రాజకీయ రంగంలో ప్రక్షాళన జరుగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ మధ్య ఆవేశంగా చేసిన ప్రకటన వినడానికి చాలా బాగుంటుంది. కొత్తరక్తం అంటే యువత అనా, తన అభిమానులనా అర్థం? ఒకవేళ తన అభిమానులనే రాజకీయాల్లోకి రమ్మని పిలవడం అయితే వారికి ఇతర నటుల అభిమానులను చూసి ఓర్వలేనితనం ఎందుకు? వారు పక్షపాత రాయుళ్లు. చదువుకోవలసిన విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో జాతివ్యతిరేక శక్తులకు జైకొడుతూ రాజకీయాల్లోకి వస్తే ఒరిగేది ఏముంటుంది? ప్రజలకు సేవ చేద్దామని ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చినవారు ఏం చేయగలిగారు. మనలో మార్పు రానిదే కొత్తరక్తం వచ్చినా ఉపయోగం లేదు. కేజ్రీవాల్, జయప్రకాశ్ నారాయణ్‌వంటివారు ఎందుకు విఫలమయ్యారు? పాత, కొత్త రక్తాలన్నీ ఒకే తానులో ముక్కలే.
-బి.సోనాలి, సూర్యారావుపేట
స్వయంపోషకంగా ‘ఇంటర్ బోర్డు’
‘ఇంటర్మీడియట్ బోర్డ్’ వ్యవస్థని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్ది స్వయం పోషకంగా నడిపించాలి. కళాశాల అధ్యాపకుల భర్తీలోను ఆ వ్యవస్థే స్వతంత్రంగా వ్యవహరించి, మిగతా సిబ్బందిని సైతం వారే భర్తీ చేసుకోగలగాలి. ఈ విషయంలో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోరాదు. అర్హతను బట్టి అందరికీ అవకాశాలు కల్పించాలి.
-కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
తీరని రైతుల కష్టాలు
రైతుల కష్టాలు తీరడం లేదు. అప్పుల్లో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నీరు, విద్యుత్ సమస్యలకు తోడు కల్తీవిత్తనాలు వారిని నిలువునా ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం మరో సమస్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుకు భరోసా ఇచ్చే విధానాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా కార్యాచరణలో ఇంకా వారికి ఫలాలు అందాల్సి ఉంది.
-కురువ శ్రీనివాసులు, గిద్దలూరు
రాజకీయాలకు బలికావద్దు
ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయోరావోనన్న ఆందోళనతో ఆమధ్య ఉస్మానియా వర్శిటీకి చెందిన ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం గుర్తుండే ఉంటుంది. తెలంగాణ రాదేమోనని చాలామంది ప్రాణత్యాగం చేశారు. అయితే ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. అలాగే భవిష్యత్‌లో ఉద్యోగాలు కల్పించక తప్పదన్నది అందరికీ తెలిసినదే. మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నియామకాలు చేపట్టక తప్పదు. ఈ విషయంలో భరోసా ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు సకాలంలో వేయకపోవడం వల్ల యువకులు ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఆశతో మనిషి బతకాలి. రాజకీయ నాయకుల ఉచ్చులో పడి ఆవేశంతో ప్రాణాలు తీసుకోవడం సరికాదు. -వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్