ఉత్తరాయణం

వదలని ‘ఆధార్’ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని ప్రచారం జరిగింది. అనుసంధానం చేసుకోవాలని పదేపదే సంక్షిప్త సందేశాలు వస్తూనే ఉన్నాయి. ఈలోగా ఈ గడువును పెంచినట్లు వార్తలు వచ్చాయి. ఈనెల 11న బ్యాంకు వెళ్లి నగదు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినపుడు బ్యాంకు సిబ్బంది తీరు బాగోలేదు. టోకెన్ ఇచ్చి, డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. బ్యాంకు మేనేజర్‌ను కలిస్తే ఆధార్ అనుసంధానం చేస్తేనే నగదు చెల్లింపులు చేస్తామని చెప్పడం, గట్టిగా నిలదీస్తే ఈసారికి ఇస్తామనడం నాకు ఎదురైన అనుభవం. నిజానికి ప్రభుత్వం నుంచి అలాంటి వత్తిడి లేదు. అయినా సిబ్బంది తీరు కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. ఆధార్ అనుసంధానంపై స్పష్టమైన విధివిధానాలను ఖాతాదారులకు అర్ధమయ్యేలా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
-కె.ప్రవీణ్, కాకినాడ