ఉత్తరాయణం

పోలీసుల ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో పోలీసుల వైఖరి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో వెదిరె గ్రామంలో చిన్నపాటి గొడవలతో విడిపోయిన జంటను కౌన్సిలింగ్ ద్వారా కలిపిన పోలీసులు పలువురికి మార్గదర్శకులుగా నిలిచారు. రామగుండం పోలీస్ ఉన్నతాధికారి దుగల్ అమలు చేస్తున్న ‘పునర్జన్మ’ కార్యక్రమం, ‘సేవాసదన్’ ఒంటరిగా తిరిగే అనాధలను అక్కున చేర్చుకుంటోంది. జనమైత్రి కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజల స్నేహితులని చాటిచెబుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. పోలీసుల జీతాలు పెంచడం, హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారిని విధిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తున్నాయి.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి