ఉత్తరాయణం

ప్రజారవాణాను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ మెట్రోలో ఆమధ్య ప్రయాణించిన ప్రధాని నరేంద్రమోదీ పెట్రో ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రజలు వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణావైపు మళ్లాలని కోరడం సమంజసమే. అయితే ఆయన మాటలు ఆచరణలోకి రావాలంటే ప్రభుత్వమే ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలి. చార్జీలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండాలి. బస్సుల టిక్కెట్ ధరలు భారీగా ఉండటం, సుదూర ప్రాంతాలకు రైలు సౌకర్యాలు తగినట్లు లేకపోవడం వల్ల ప్రజలు సొంత వాహనాలను వినియోగించక తప్పడం లేదు. పర్యావరణానికి హానిచేస్తున్న కారణాల్లో ఇదికూడా ఒకటి. అందువల్ల చార్జీల బాదుడు లేకుండా పర్యావరణ, ప్రజారోగ్య అనుకూల విధానాలు అమలు చేస్తే ప్రజారవాణా వ్యవస్థకు చక్కటి ఆదరణ లభిస్తుంది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
ఏపీలో తెలుగు
సభలు నిర్వహించాలి
తెలంగాణలో గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆరో ప్రపంచ తెలుగు మహాసభలను ఈసారి అమరావతిలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావాలి. వాటిని ఈ ఏడాదే నిర్వహించాలి. 2019లో ఎన్నికలు వస్తాయి. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కష్టమవుతుంది. ప్రాంతీయ బేధాలు చూపకుండా పారదర్శకంగా ఈ సభలను జరపాలి. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల తెలుగువారున్నారు. వారందరికీ నచ్చేలా ఈ సభలను జరపాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు