ఉత్తరాయణం

అంధులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంధత్వం, దృష్టిదోషంతో ఉన్నవారికి సమాజం, ప్రభుత్వం అండగా నిలవాలి. ప్రభుత్వాలు వారికోసం ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి అవసరం ఉంది. కళ్లు లేకపోయినా ధైర్యంగా నిత్య జీవనయానాన్ని సాగించడానికి మార్గం చూపినవాడు బ్రెయిలీ. అంధుల కోసం లిపిని అభివృద్ధి చేసి మార్గదర్శిగా నిలిచాడు. ఆ లిపికి అతడిపేరే పెట్టారు. జనవరి 4వ తేదీని బ్రెయిలీ జయంతి. ఆ రోజున ‘ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం’గా పాటిస్తారు. 1832లో 12 చుక్కల ప్రత్యేక లిపిని ఆరు చుక్కల లిపిగా మార్చాడు. అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
అంధుల జీవితాలను మార్చేసింది. అయితే బ్రెయిలీ లిపిలో విద్య, ఉద్యోగాలు చేయడానికి తగిన సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సమాజం కూడా వారిని మిగతావారిలాగానే గౌరవిస్తూ సహకరించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, పరకాల