ఉత్తరాయణం

బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయ సిబ్బంది, ఉద్యోగుల వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలన్న జీవో 577లో లొసుగులున్నాయి. దీనివల్ల జీతంలో కొంత నేరుగా చెల్లిస్తూ, కొంత బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు అర్చకుల ఆశీర్వాదం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అందువల్లే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు ఆలయ సిబ్బందికి 2015 పిఆర్‌సి ప్రకారం వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీకి యావత్ 5625 సిబ్బందికి తమతమ బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. తెలంగాణకు జూన్ 2వ తేదీ ఎంత ముఖ్యమో, అర్చక ఉద్యోగులకు డిసెంబర్ 1వ తేదీ అంతే గొప్పదని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు. ఆయన ప్రకటనతో అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కేవలం 734 మందికి మాత్రమే, అది కూడా పిఆర్‌సి ప్రకారం పెరిగిన మొత్తాన్ని మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వీరికి రావలసిన మిగతా మొత్తం ఎప్పటిలా ఆలయాల నుండి ఇచ్చేలా నిర్ణయించారు. ఒక చిన్న జీతాన్ని రెండుగా విభజించి ఇవ్వాలా? తిరకాసులతో ఉన్న జీఓ 577ను సవరించి జీతం ఏకమొత్తంగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఒక ఉద్యోగం -ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలి.
-చామర్తి వెంకటరామకృష్ణ, హైదరాబాద్