ఉత్తరాయణం

ఇసుక మాఫియా ఆటకట్టించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో రోజురోజుకూ ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగం అవసరాల రీత్యా జిల్లాల్లోని వాగులు, నదుల నుంచి పెద్దఎత్తున ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అడ్డుకున్నవారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజూ వేలాది లారీల ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం గ్రామానికి చెందిన బోయిని సాయిలు అనే విఆర్‌ఏ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కక్షగట్టి అందరూ చూస్తుండగానే ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేయడం అమానుషం. ఇసుక మాఫియా ఆటకట్టించేందుకు ఆయా విభాగాలు కలసికట్టుగా వ్యవహరించాలి.
-కె.ఎస్.రెడ్డి, వరంగల్
ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు
సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లు వెళ్లే ప్రయాణీకులను అటు ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు, ఇటు ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీల పేరుతో భారం మోపుతున్నాయి. స్పెషల్ బస్సుల పేరుతో సౌకర్యాలు లేని సాదాసీదా బస్సులు నడుపుతూ అసలు ఛార్జీతోపాటు మరో సగం ఎక్కువగా వసూలు చేయడం సామాన్య ప్రయాణీకులకు భారంగా మారింది. సంక్రాంతి సందర్భంగా లక్షలాదిమంది హైదరాబాద్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. విశాఖ, విజయవాడసహా ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసి అదనపు బస్సులను వేసి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇక ప్రైవేటు బస్సుల దోపిడీ మామూలుగా లేదు. ప్రభుత్వాలు ఆదాయంపై దృష్టితో కాకుండా ప్రజాసంక్షేమం దృష్టితో వ్యవహరించవలసిన అవసరం ఉంది.
-ఎస్.శ్రీనివాస రాజు, వనస్థలిపురం