ఉత్తరాయణం

విద్యారంగంపై పర్యవేక్షణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్నిరకాల వౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశానికి విద్యార్థినీవిద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు ఉపాధ్యాయుల తీరువల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు ఇతర వ్యాపకాలపై శ్రద్ధపెడుతున్నారు. రియల్‌ఎస్టేట్, జీవితబీమా, ఫైనాన్స్ వ్యవహారాలను చక్కబెడుతూ అసలు బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యారంగంలో ఉన్నతాధికారుల నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో వారిదే ఇష్టారాజ్యం. బోధన సిబ్బంది సరిగా లేకపోవడంతో ఆసక్తి ఉన్నప్పటికీ విద్యార్థులను చేర్పించడానికి వారి తల్లితండ్రులు వెనుకంజవేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ అలాంటివారు తక్కువగానే ఉన్నారు. అసలు బాధ్యతలు మరచి పక్కచూపులు చూస్తున్న బోధనాసిబ్బందిపై గట్టి చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పథకాలు చక్కటి ఫలితాన్నిస్తాయి. విద్యారంగాన్ని పరిపుష్ఠం చేస్తాయి.
-గుండమళ్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపురం