ఉత్తరాయణం

ఖాతాదారుల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలలో చాలాచోట్ల విత్‌డ్రా చేద్దామంటే నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్‌బ్యాంకు ఏటిఎంలకు వెళితే కార్డు స్వైప్ చేసినవెంటనే ఆధార్ లింక్ చేస్తావా, ఇంకేం చేయాలి అన్న వివరాలు వస్తాయి, ట్రాన్‌సాక్షన్ స్లిప్ కావాలా అన్న ప్రశ్న వస్తుంది. అన్నీ అయ్యాక నో క్యాష్, చింతిస్తున్నామంటూ ఓ బొమ్మ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. వేరే ఏటీఎంకు వెళ్లి నగదు విత్ డ్రా చేస్తే, వస్తే సంతోషమే. అయినా మొబైల్‌కు ఓ సందేశం వస్తుంది. అవకతవకలు జరగకూడదనుకుంటే స్టేట్‌బ్యాంకు ఏటీఎంలోనే నగదు విత్‌డ్రా చేయమని. ఏం చెప్పాలి? ఐదారు నెలలుగా ఇదే తంతు. బ్యాంకులు ఖాతాదారులతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాయో అర్థంగాదు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
నత్తనడకన మిషన్ భగీరథ
తెలంగాణలోని ప్రతీ ఇంటికీ 2018నాటికి మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇంకా కార్యరూపందాల్చలేదు. ఇప్పటికి 80 శాతం పనులు మాత్రమే ఆ పథకం కింద పూర్తయ్యాయి. కనీసం వచ్చేఏడు శాసనసభ ఎన్నికల నాటికైనా ఇంటింటికీ మంచినీరు అందుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పనులు పూర్తికావన్న అనుమానం లేదు. కానీ, ఇప్పటికీ పూర్తి కావలసినవి ఎందువల్ల జాప్యమవుతున్నాయన్నది సందేహం. ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. నిధుల కొరత లేదా అధికారుల అలసత్వంవల్ల ఇలా జరుగుతోందన్నది తేల్చాలి. మొదట ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్న నల్గొండ జిల్లాలో త్వరితగతిన ఈ పథకం పనులు పూర్తి చేస్తే మేలు.
-్ధళిపాళ మోహనశర్మ, కుక్కడం
దారితప్పిన చర్చలు
ఈ రోజుల్లో పార్లమెంటు సమావేశాలు నిరాశానిస్పృహలను మిగుల్చుతున్నాయి. అర్థవంతమైన చర్చలకు అవకాశమే దొరకడం లేదు. అభిజాత్యాలు, రాజకీయాలు ఎక్కువై ప్రజాసమస్యలపై దీటైన చర్చలు సాగడం లేదు. పార్టీ విభేదాలు తప్ప జాతిశ్రేయస్సు ఎవరికీ పట్టడం లేదు. గతంలో అలాంటి పరిస్థితులు ఉండేవికావు. మన భూబాగాన్ని చైనా ఆక్రమించినప్పుడు పార్లమెంటులో అలజడి రేగింది. ‘అది గడ్డికూడా మొలవని చవిటి పర్ర. దానికోసం అంత ఆందోళన ఎందుకు?’ అని ప్రధాని నెహ్రూ ప్రశ్నించగా ‘మీ తలమీద కూడా గడ్డి (జుట్టు) మొలవదు. అదీ చవిటి పర్రే?’ అని పీలూమోదీ వ్యాఖ్యానించడం సభలో నవ్వులు విరియడం గొప్పగా చెప్పుకునేవారు. మరో సందర్భంలో పీలూమోదీని సీఐఎ ఏజెంట్ అని విమర్శించడం, ఆయన మర్నాడు ‘నేను సీఐఏ ఏజెంట్’ను అన్న బ్యాడ్జ్ తగిలించుకుని సభలోకి అడుగుపెట్టడం, స్పీకరం అభ్యంతరం చెప్పడంతో ‘చూశారా నేను సీఐఏ ఏజెంట్‌ను కాను’’ అనడం, మళ్లీ నవ్వులు విరయడం అప్పటి పార్లమెంటు నిర్వహణ తీరుకు నిదర్శనం. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా?
-సంపూర్ణ, సాంబమూర్తి నగర్