ఉత్తరాయణం

ఎవరికీ ఊరట ఇవ్వని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆఖరిదైన పూర్తిస్థాయి బడ్జెట్‌ను మోదీ సర్కారు జనరంజకంగా రూపొందించక పోయినా బోలెడన్ని తీపి కబుర్లతో నింపింది. ఇది ఎన్నికల హామీలకు ముందుగా రిహార్సల్ చేసినట్టు ఉందే తప్ప ఎవరికీ ఎలాంటి ఊరట ఇవ్వలేదు. ఈ ఏడాది 50 శాతం పరోక్ష పన్నుల వృద్ధితో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్నట్లు సర్వే చెప్పినా, అందుకు అనుగుణమైన ఓదార్పు ఈ బడ్జెట్‌లో ప్రజలకు లభించలేదు. హవాయి చెప్పులు వేసుకునే ప్రతివారూ ‘హవాయి యాత్ర’ చేసేలా దేశీయ వైమానిక యానాన్ని ఐదు రెట్లు అభివృద్ధి చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భరోసా ఇచ్చారు. రైతులకు కూడా దాదాపు అదే తరహాలో హామీలిచ్చారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ప్రస్తుతానికైతే హవాయి చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని రాబోయే విమానం కోసం ఎదురు చూడాలేమో!
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అన్ని పంటలకూ పెట్టుబడి ఖర్చులకు ఒకటిన్నర రెట్లుగా కనీస మద్దతుధర నిర్ణయిస్తామని ప్రకటించడం బాగుంది. కర్షకులకు రుణ పరపతి, గోదాముల నిర్మాణం, ఫ్యూచర్ ట్రేడింగ్ వంటి నల్లబజారు వ్యూహాలను అరికట్టడం లాంటి సిఫార్సులపై కార్యాచరణ లేదు. పర్యావరణ మార్పుల వల్ల 25 శాతం మేరకు పంట నష్టం జరుగుతోందన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గ ప్రణాళికలు, ముఖ్యంగా సాగునీటికి సంబంధించి లేవు. 30 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతులను వంద బిలియన్ డాలర్లకు పెంచుతామన్నది ఆశావహ దృక్పథమే కానీ వాస్తవ అంచనా కాదు. వ్యవసాయ సంక్షోభానికి ఈ బడ్జెట్ ద్వారా పైపూతలా మందు రాశారు. 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 5లక్షల రూపాయల మేరకు ఆరోగ్య బీమా కల్పించడం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకమని గొప్పలు చెప్పారు. దేశవ్యాప్తంగా లక్షన్నర వైద్య కేంద్రాలను, ప్రతి మూడు లోక్‌సభ స్థానాలకు ఒక వైద్య కళాశాలను నెలకొల్పుతామని ప్రకటించడం హర్షణీయమే. వైద్యులు, మందుల కొరతతో జబ్బుపడ్డ ప్రజారోగ్య రంగానికి జీడీపీ ఆదాయంలో కనీసం 5 శాతం కేటాయిస్తే బాగుండేది. పన్నులు చెల్లిస్తున్న మధ్య తరగతి వేతన జీవులకు ఎలాంటి ఉపశమనం లేదు. తక్షణ ఊరట దక్కింది మాత్రం పార్లమెంటు సభ్యులకే. వీరికి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఐదేళ్లకోసారి జీతాలు సవరిస్తామన్నారు. పన్నుల వడ్డింపులో ప్రజలపై కాస్త జాలి చూపిస్తే బాగుండేది. అన్ని రకాల పన్నులతో రాబడి పెరిగి ప్రభుత్వ ఖజానా కళకళలాడుతున్న వేళ ప్రజలపై కాస్త పన్ను భారం తగ్గిస్తే సమంజసంగా ఉండేది.
- డా. జీవీజీ శంకరరావు, పార్వతీపురం

స్వార్థ ప్రయోజనాలకు గుడులు!
పవిత్రమైన ఆలయాలను స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వాడుకుంటున్నారనడానికి విజయవాడ కనకదుర్గ గుడిలో ఇటీవల జరిగిన క్షుద్రపూజల ఉదంతం అద్దం పడుతోంది. ఈ ఘటన భక్తుల హృదయాలను కలచివేసింది. ఇదంతా కుట్ర అని అప్పటి ఆలయ ఈవో కుంటిసాకులు చెప్పడం, అర్ధరాత్రి గుడిలో పూజలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలడం అందరినీ నిర్ఘాంత పరచింది. ఆదాయంపై యావతో ప్రభుత్వాలు హిందూ ఆలయాలపై పెత్తనం చలాయించడం వల్లే ఇలాంటి దురంతాలు జరుగుతున్నాయి. అధికారులు ఆలయాలను సొంత ఇళ్లలా వాడుకుంటూ సంప్రదాయాలను తుంగలో తొక్కడం పరిపాటైంది. మరోవైపు ప్రభుత్వ అజమాయిషీ హిందూ ఆలయాలపైనే కొనసాగడం దారుణం.
- అయోధ్యరామ్, పెద్దాపురం
ఉచిత పథకాలు ఎందుకు?
ఎన్నికలు వస్తే చాలు మన దేశంలో రాజకీయ పార్టీలు అనేక ఉచిత పథకాలను, తాయిలాలను ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పించి ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం సబబు కాదు. లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నందున ఉచిత పథకాలను ప్రకటించడాన్ని నిషేధించాలి. అలాగే, రహదారుల పక్కన, భవనాలపైన భారీ ఫ్లెక్సీలను పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలి. రాత్రివేళ సమయం ముగిసిన తర్వాత బహిరంగ సభలు నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానాను జనాకర్షక పథకాలకు ఖర్చు చేస్తామంటున్న వారిని, ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రకటించేవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి.
- కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు